ఇండస్ట్రీలో హిట్లుంటేనే ఎవరైనా సినిమా చేయడానికి ఒప్పుకుంటారు.అయితే ప్లాప్ తీసిన దర్శకులతో వర్క్ చేయాలంటే ఈ రోజుల్లో నిర్మాతల కన్నా హీరోలు ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ వెంకటేష్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులేస్తున్నారు. అతని కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఏదైనా ఉందా అంటే అది షాడోనే. 

అప్పటివరకు ఓ మోస్తరుగా ఉన్న వెంకీ కెరీర్ ను ఆ సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. శక్తి  సినిమాతో డిజాస్టర్ అందుకున్నా కూడా అప్పట్లో మెహర్ రమేష్  డైరెక్షన్ ని నమ్మి వెంకీ మోసపోయాడు. అయితే ఇప్పుడు షాడో దెబ్బ మర్చిపోయి వినాయక్ తో సినిమా చేయడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక్ కమర్షియల్ మూవీస్ పై జనాలకు బోర్ కొట్టేసింది. డిఫరెంట్ యాంగిల్స్ లో సినిమాలు చేయలేడని ముద్ర కూడా పడింది. 

ఇలాంటి సమయంలో వినాయక్ తో అందరూ హీరోలు వెనకడుగు వేస్తుంటే వినాయక్ తో లక్ష్మి సినిమా తరువాత మరో సినిమా చేయడానికి వెంకీ సిద్దమయ్యాడు. దీంతో వెంకీ అభిమానుల్లో కొంచెం ఆందోళన మొదలైంది. అప్పట్లో లక్ష్మి సినిమా బాగానే వర్కౌట్ అయ్యింది కానీ ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంటే వినాయక్ పై పూర్తి నమ్మకం పోతుంది. మరి వెంకటేష్ తో ఆయన ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.