నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి మోక్షజ్ఞ తెరగ్రేటం పై ఎన్నో రకాల కథనాలు అభిమానుల్లో ఆశల్ని రేపాయి. అయితే తనయుడి ఎంట్రీపై రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక బాలయ్య చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ ఏడాది చివరలో మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రముఖ రచయితల నుంచి కొన్ని కథలను విన్న  బాలకృష్ణ తనకు నచ్చిన మూడు కథలను పక్కన పెట్టుకున్నట్లు టాక్. 

ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఆ కథను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోక్షజ్ఞ ఇప్పటికే న్యూ యార్క్ లో తన యాక్టింగ్ కోర్స్ ముగించుకొని ఇండియాకు వచ్చేశాడు. వీలైనంత త్వరగా దర్శకుడ్ని సెట్ చేసి బాలకృష్ణ తనదైన శైలిలో కొడుకును వెండితెరకు పరిచయం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.