Asianet News TeluguAsianet News Telugu

రష్మికతో 'ఫస్ట్ నైట్' చాలా వైలెంట్ గా ఉంటుందిట

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో అడియన్స్ ముందుకు రానుంది.  ఈ సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది.  

Violent First Night Scene of Rashmika Mandanna in Animal jsp
Author
First Published Oct 8, 2023, 3:55 PM IST


 అర్జున్ రెడ్డి సూపర్ హిట్  తర్వాత  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్  రణ్‍బీర్ కపూర్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే రిలీజైన యానిమల్ టీజర్ గ్లింప్స్, టీజర్ చూశాకా అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ లీక్ బయిటకు వచ్చి వైరల్ అవుతోంది.  ఆ లీక్ మరేదో కాదు రణబీర్ కపూర్, రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్ గురించి కావటం విశేషం.

ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్  ఉందని అయితే అది చాలా వైలెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఒకవైపు ఫస్ట్ నైట్... మరో వైపు విలన్స్ ఎటాక్... రెండిటినీ బాలన్స్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తీసిన సీన్స్ సినిమాలో గొప్పగా ఉండబోతున్నట్లు బాలీవుడ్ సమాచారం. అక్కడి మీడియా నుంచి వస్తున్న వార్తలను బట్టి రణబీర్, రష్మిక  వివాహం తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుండగా... విలన్స్ ఎటాక్ చేస్తారని, ఆ సీన్స్  బాగా వచ్చాయని ఇన్‌సైడ్ టాక్. అయితే ఇది కావాలని సినిమాపై బజ్ పెంచటానికి వదిలిన లీక్ అని తెలుస్తోంది. 
 
ఈ పాన్ ఇండియా మూవీపై తెలుగులోనూ  భారీ అంచనాలున్నాయి.  మాఫియా నేపధ్యంలో వస్తున్న యానిమల్ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
  
 ఇక సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే హీరో రణ్‌బీర్ కపూర్ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘యానిమల్ స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు.. నాకు ఇంకా గుర్తుంది.. డైరెక్టర్ సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేయడం పూర్తికాగానే నేను నా బాత్‌రూంలోకి వెళ్లాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. చాలా భయపడ్డాను. ఒక స్టోరీ, ఒక పాత్ర గురించి విని నేను భయపడటం ఇదే తొలిసారి. సినిమా చాలా బాగా వస్తోంది. సందీప్‌తో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇదొక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా. తండ్రీకొడుకుల ప్రేమకథ. ’ అని రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు.

మొత్తానికి సందీప్ రెడ్డి వంగా చాలా గ్యాప్ తరవాత తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఆడియన్స్‌కు మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో కిక్ ఇవ్వబోతున్నారు. అయితే, ‘యానిమల్’ కథను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకు సందీప్ చెప్పారట. అప్పుడు ‘డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్ దగ్గరకు తీసుకెళ్లారు సందీప్. ఈ సినిమాను రణ్‌బీర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, రష్మిక మందన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios