రామ్ చరణ్ - వినయవిధేయ రామ ఎట్టకేలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకుంది. బోయపాటి దర్శకత్వం వహించడంతో సినిమాపై మాస్ ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యారు. అయితే సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన చరణ్ అదరగొట్టేశాడని టాక్ వస్తోంది. బాక్స్ ఆఫీస్ హిట్స్ లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూడవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. 

ఇక మొదట రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్స్ ను అందుకుంది. బాహుబలి - అజ్ఞాతవాసి తరువాత వినయవిధేయ రామ మొదటి రోజు అత్యధిక వసూళ్లను అందుకున్న మూడవ చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా సీడెడ్ లో బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది. ఆ సినిమా ఫస్ట్ డే 6 కోట్ల షేర్స్ అందుకోగా చరణ్ సినిమా 7.20 కోట్ల షేర్స్ ను అందించింది. 

ఏరియాల వారీగా ఫస్ట్ డే తెలంగాణ - ఆంధ్ర షేర్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం.. 5.08 కోట్లు 

సీడెడ్..7.20 కోట్లు 

నెల్లూరు...1.6 9కోట్లు 

గుంటూరు..4.18 కోట్లు 

కృష్ణా...1.59కోట్లు 

పశ్చిమ గోదావరి...1. 83 కోట్లు 

తూర్పు గోదావరి...2.05 కోట్లు 

ఉత్తరాంధ్ర....2.45కోట్లు 

ఏపీ, తెలంగాణ మొత్తం షేర్..26.07 కోట్లు