సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న వినయ విధేయ రామ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అలాగే సెన్సార్ పనులను కూడా ఫినిష్ చేసుకుంది. ఇక CBFC వినయవిధేయ రాముడికి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

అయితే సంక్రాంతి ఫైట్ లో రామ్ చరణ్ తప్పకుండా మాస్ అభిమానులను మెప్పిస్తాడని టాక్ వినిపిస్తోంది.  వినయంగా ఉండే రాముడు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశంతో సినిమా ఆకట్టుకోనుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. రంగస్థలం తరువాత రామ్ చరణ్ ఒక డిఫరెంట్ జానర్ ని టచ్ చేశాడని ఇప్పటికే జనాల్లో అంచనాలు పెరిగాయి. 

సినిమా ట్రైలర్ అండ్ పోస్టర్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా సంక్రాంతిలో మాస్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండనుందని టాక్. మరి ఆ టాక్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.