బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టిన రామ్ చరణ్ డెసిషన్ గొడవలు తెచ్చి పెట్టింది. ఆ గొడవ ఇప్పుడు పెద్దదై..నిర్మాత దానయ్య ను...ఎక్కౌంట్స్ బుక్స్ చూపించి లెక్కలు చెప్పమనేదాకా వెళ్లిందని తెలుస్తోంది. 

సినిమాకు పెట్టిన ఖర్చు, బిజినెస్ డీల్స్, ఎంత వెనక్కి వచ్చింది..సాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ ద్వారా ఎంతంత రికవరీ అయ్యిందో చెప్తే తను ఎంత వెనక్కి  ఇవ్వాలనేది నిర్ణయించుకుంటానని బోయపాటి చెప్పినట్లు సమాచారం. బోయపాటి దృష్టిలో రామ్ చరణ్, దానయ్య ఈ సినిమాతో మంచి లాభాలు సంపాదించారని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ నటించగా సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా పరిస్దితి అదే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ  విషయాన్ని ఖరారు చేస్తూ రామ్ చరణ్ అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు. ఈ విషయమే బోయపాటికు మండుకొచ్చిందని, నిర్మాతతో కలిసి తనను టార్గెట్ చేసినట్లుగా ఫీల్ అవుతున్నారని  వినపడుతోంది. దాంతో ఆయన ఫైట్ చేయటానికి సిద్దపడి లెక్కలు చూపించమన్నట్లుగా అడిగారని, మరి దానికి దానయ్య ఎలా స్పందిస్తారో తెలియాలి. 

నిర్మాతతో బోయపాటి గొడవ.. ఒకరినొకరు బూతులు తిట్టుకొని..!