బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. టీజర్ లోని ఆ ఒక్క డైలాగ్ సినిమా కథ ఏ కోణంలో సాగుతుందనేది ఆసక్తిని పెంచుతోంది. 

కథ బాగుంటే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతోన్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగింది. లవ్, కామెడీ , థిల్లర్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ చిత్ర టీజర్. ముఖ్యంగా విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్వు కామెడీ మిక్సయి క్రైమ్ నుంచి సస్పన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు’ అని కిరణ్ చెప్పిన డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ టీజర్. ఈ సినిమాలో మురళీ శర్మ పాత్ర ఆకట్టుకోనుందని ఈ టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. 

వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్నారు. కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira) నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన "వాసవసుహాస" పాటకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ఇది. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్’ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం కావడం విశేషం. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. 

Scroll to load tweet…