Asianet News TeluguAsianet News Telugu

విక్రమ్ - కమల్ లకు నెట్ ఫ్లిక్స్ దెబ్బ

అసలే విక్రమ్ టైమ్ బాగోలేదు. గత కొంతకాలంగా వరస సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినా ఎప్పటికప్పుడు ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవాలని, కొత్త గెటప్స్ తో ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కమల్ హాసన్ సైతం ముందుకు వచ్చి విక్రమ్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ కు రెడీ చేసారు. సినిమా కూడా బాగా వచ్చిందని టాక్. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అయితే అదే సమయంలో ఈ సినిమాకు హాలీవుడ్ రీమేక్ నుంచి సమస్య వచ్చిపడింది. 
 

Vikrams Mr KK get problem with Netflix Remake
Author
Hyderabad, First Published Jul 5, 2019, 9:13 AM IST

 

అసలే విక్రమ్ టైమ్ బాగోలేదు. గత కొంతకాలంగా వరస సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినా ఎప్పటికప్పుడు ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవాలని, కొత్త గెటప్స్ తో ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కమల్ హాసన్ సైతం ముందుకు వచ్చి విక్రమ్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ కు రెడీ చేసారు. సినిమా కూడా బాగా వచ్చిందని టాక్. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అయితే అదే సమయంలో ఈ సినిమాకు హాలీవుడ్ రీమేక్ నుంచి సమస్య వచ్చిపడింది. 

వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు విక్రమ్‌ హీరోగా రూపొందిన సినిమా 'మిస్టర్‌ కేకే'. అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం. తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా 'మిస్టర్‌ కేకే' పేరుతో విడుదల చేస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా థ్రిల్‌ని అందించే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం పాయింట్ బ్లాంక్ అనే ప్రెంచ్ ఫిల్మ్ రీమేక్ గా తెరకెక్కింది. కమల్ ఈ చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు. 

అయితే అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ వాళ్లు సైతం అదే టైటిల్ తో ఇంగ్లీష్ లో ఈ చిత్రం తెరకెక్కించారు. కరెక్ట్ గా విక్రమ్ సినిమా రిలీజ్ కు ఓ వారం ముందు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారు. దాంతో ఓవర్ సీస్ మార్కెట్ లో విక్రమ్ సినిమా కు దెబ్బ పడే అవకాసం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ తెలుగు,తమిళ రాష్ట్రాల్లో నెట్ ఫ్లిక్స్ ని ఫాలో అయ్యేవాళ్లు తక్కువ కాబట్టిగా ప్లాబ్లం లేదు కానీ ఇతర దేశాల్లో ఉన్న మనవాళ్లు చాలా మంది నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు బా గా చూస్తున్నారు. దాంతో వారం తేడాలో రిలీజ్ అయ్యే ఈ సినిమాపై ఇంపాక్ట్ పడుతుందని టెన్షన్ పడుతున్నారు

నిర్మాతలు మాట్లాడుతూ 'ఇటీవలే మేం విడుదల చేసిన 'కిల్లర్‌' చిత్రం మంచి కమర్షియల్‌ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విడదుల చేస్తున్నాం. ట్రైలర్‌లో విక్రమ్‌ గెటప్‌, ఆయన లుక్‌ చింపేసిందని అందరూ ఒకే మాట చెబుతున్నారు. విజువల్‌ గ్రాండియర్‌గా కనిపించిన ఈ చిత్రం గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లోనే కనిపించటం విశేషం. అక్షర హసన్‌ కూడా పెర్‌ఫార్మెన్స్‌ స్కోప్‌ ఉన్న పాత్రలో కనిపించింది.

 'సాహో' తర్వాత జిబ్రాన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ని ఇవ్వటం ఈ సినిమా రేంజ్‌ని డబుల్‌ చేసింది. ట్రైలర్‌లో విక్రమ్‌ చెప్పిన 'నువ్వు ఆడుతున్నది నాతో కాదు యముడితో' అనే డైలాగ్‌కి అనూహ్య స్పందన వచ్చింది. దానితో అంచనాలూ మొదలయ్యాయి. సమర్థుడైన కమాండర్‌గా విక్రమ్‌ యాక్షన్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోనుంది. ట్రైలర్‌లో యాక్షన్‌ ఎక్కువ చూపించినా థ్రిల్లింగ్‌ ఎపిసోడ్స్‌ చాలా ఉన్నాయి' అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios