కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఫ్యామిలీ నుంచి మరో యువ కథానాయకుడు తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ప్రయోగాత్మకమైన సినిమాలతో జయాపజయాలతో సంబంధం లేకుండా విక్రమ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇక ఇప్పుడు ఆయన తనయుడు ధృవ్ ఆదిత్య వర్మ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అదే తరహాలో డిఫరెంట్ సినిమాతో విక్రమ్ మేనల్లుడు అర్జుమాన్ కూడా కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. PUBG (పొల్లదా ఉలగిల్ బయనగర గేమ్) అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. 

త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ ని విక్రమ్ తెలియజేయనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ ఫెమ్ ఐశ్వర్య దత్త హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను జీడీఈ ప్రొడక్షన్ నిర్మిస్తోంది.