విలక్షణ నటుడు విక్రమ్‌ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `తంగలాన్‌` చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు.  దీంతో ఆయన్ని హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. 

విలక్షణ నటుడు విక్రమ్‌ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `తంగలాన్‌~ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగినట్టు తెలుస్తుంది. వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆపరేషన్‌ అవసరం అని వైద్యులు తెలియజేసినట్టు తెలుస్తుంది. 

విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న `తంగలాన్‌` చిత్రానికి పా రంజిత్‌ దర్శత్వం వహిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ సినిమా రూపొందుతుంది. మరో రెండు రోజులు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే దానికంటే ముందు చిత్ర బృందం రిహార్సల్స్ లో పాల్గొన్నదట. అందులో భాగంగానే ప్రమాదం జరిగిందని, విక్రమ్‌కి పక్కటెముక విరిగిందని తెలుస్తుంది. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్‌ చేయాల్సి వస్తుందని వైద్యులు నిర్థారించినట్టు సమాచారం. 

విక్రమ్‌ ఈ గాయం నుంచి తిరిగి కోలుకున్నాకే షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించాయి. అభిమానుల ప్రేమతో విక్రమ్‌ త్వరగా కోలుకుని తిరిగి వస్తాడని నమ్ముతున్నట్టు వెల్లడించింది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తుంది. కర్నాటకలోని కేజీఎఫ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడికల్‌ చిత్రం. ఇందులో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు పశుపతి, డేనియల్‌, కాల్టాగిరోన్‌ నటిస్తున్నారు. 

ఇటీవల విక్రమ్‌ `పొన్నియిన్‌ సెల్వన్‌ 2`తో మెప్పించారు. ఇందులో ఛోళయువరాజు ఆదిత్య కరికాలన్‌ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఐశ్వర్యరాయ్‌తో ఆయన ప్రేమాయణం, ఆయన ఆమె చేతిలో మరణించడం వంటి సన్నివేశాల్లో ఆడియెన్స్ హృదయాలను పిండేశాడు. సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలిచారు. ఆడియెన్స్ హృదయాలను దోచేశారు. దీంతో ఆయనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ ఆనందం నుంచి ఇంకా బయటకు రాకముందే ఇలాంటి ప్రమాదం జరగడం విచారకరం.