విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలు విక్రమ్ నటనా ప్రతిభకు నిదర్శనాలు. ఈ పవర్ ఫుల్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ కేకే'. చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. 

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఆయన కుమార్తె అక్షర హాసన్ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. విక్రమ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. అక్షర హాసన్ గర్భవతిగా నటిస్తోంది. 

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ' నువ్వు ఆడుకున్నది నాతో కాదు.. యముడితో.. అంటూ విక్రమ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.