Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ విక్రమ్ కి కోటిన్నర ఫైన్!

మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దర్శకులకు, హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి వారిని లాక్ చేస్తుంటారు నిర్మాతలు. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి కూడా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చారు. 

vikram kumar fined with 1.5 crore
Author
Hyderabad, First Published Nov 24, 2018, 2:32 PM IST

మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దర్శకులకు, హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి వారిని లాక్ చేస్తుంటారు నిర్మాతలు. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి కూడా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చారు.

ఇష్క్ సినిమా తరువాత అడ్వాన్స్ ఇస్తే విక్రమ్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. మనం, 24, హలో ఇలా బయట బ్యానర్ లలో సినిమా చేశాడే తప్ప అశ్వనీదత్ తో మాత్రం చేయలేదు. ఇప్పుడు నానితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా వేరే బ్యానర్ లోనే అని తెలుస్తోంది.

దీంతో అశ్వనీదత్ ఈ విషయంలో కాస్త సీరియస్ అయ్యారని టాక్. దీంతో విక్రమ్ తో పంచాయితీలు నడుపుతున్నారు. చాలా రోజుల నుండి ఫిల్మ్ ఛాంబర్, దర్శకుల సంఘంలో ఈ ఇష్యూ నడుస్తోంది. ఫైనల్ గా సినీ పెద్దలు విక్రమ్ కి కోటిన్నర ఫైన్ వేశారు.

విక్రమ్ తన తదుపరి సినిమా ఎవరితోనైనా చేసుకోవచ్చు కానీ తన రెమ్యునరేషన్ లో రూ.1.5 కోట్లను అశ్వనీదత్ కి చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఈ డబ్బుతో వైజయంతి మూవీస్ లో ఓ చిన్న సినిమాను నిర్మించవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios