Asianet News TeluguAsianet News Telugu

కర్ణి రీమేక్ ఈ రేంజ్ లోనా..

  • కర్ణి రీమేక్ ఈ రేంజ్ లోనా..
vikram karna in a huge way

పురాణాలు, ఇతిహాసాలపై ఎన్ని కథలతో సినిమాలు వచ్చాయో. వాటిలో కర్ణ సినిమాకు ఉండే ప్రత్యేకత వేరు. తెలుగులో నందమూరి తారకరామారావు గారు నటించిన దానవీరశూరకర్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూడు పాత్రల్లో నటిస్తూ తనే దర్శకత్వం కూడా వహించిన ఆయన ప్రతిభకు ప్రేక్షక లోకం పట్టం కట్టింది. కర్ణుడి పాత్రలో హీరోయిజం చూపించిన అరుదైన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. తమిళ్ లో సైతం శివాజీ గణేషన్ హీరోగా ఇంతే విజయాన్ని సొంతం చేసుకుంది ఈ కథ. ఆ మధ్య కలర్ కరెక్షన్ చేసి తమిళనాడులో డిటిఎస్ మిక్సింగ్ తో విడుదల చేస్తే  ఎగబడి చూసారు ప్రేక్షకులు. అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు మరోసారి తెరకెక్కనుంది. కర్ణ పాత్రలో చియాన్ విక్రం నటించే ఆ సినిమాకు ‘మహావీర కర్ణ’ అనే పేరుని ఫిక్స్ చేసినట్టుగా విక్రం చెబుతున్నాడు.

300 కోట్ల బడ్జెట్ తో 37 బాషలలో రూపొందే ఈ మూవీలో విక్రం డ్యూయల్ రోల్ చేయటం లేదట. కర్ణగా మాత్రమే తాను కనిపిస్తానని దుర్యోధనుడు - ధర్మ రాజు - అర్జునుడు - భీముడు తదితర కీలక పాత్రల్లో ఎవరు ఊహించని స్టార్ హీరోలు నటిస్తారని ఊరిస్తున్నాడు విక్రం. ఈ మధ్య కాలంలో మహాభారతం లాంటి ఎపిక్స్ మీద మన హీరోలు దర్శక నిర్మాతలు మనసు పారేసుకుంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్ భీముడిగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ప్రముఖ వ్యాపారవేత్త శెట్టి ఇంతకు ముందే ఒక సినిమా ప్రకటించారు కాని అది ఇంత వరకు షూటింగ్ మొదలుపెట్టుకోలేదు. కాని కర్ణ మాత్రం స్టార్ట్ చేస్తామంటున్నాడు విక్రం.

మరోవైపు కన్నడలో కూడా స్టార్ హీరో దర్శన్ తో కురుక్షేత్ర అనే భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. శాండల్ వుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదే. కాని తెలుగులో మాత్రం ఇంతవరకు ఎవరు సాహసించడం లేదు. రాజమౌళి ఓ పదేళ్ళ తర్వాత తీస్తాను అంటున్నాడు. బాలకృష్ణ చాలా ఏళ్ళ క్రితం నర్తనశాల మొదలు పెట్టాడు కాని సౌందర్య చనిపోకపోతే ఆ సినిమాని చూసుండే వాళ్ళం. ఏదేమైనా కర్ణ పాత్రకు విక్రం సరితూగే నటుడు అనడంలో మాత్రం సందేహం అక్కర్లేదు

Follow Us:
Download App:
  • android
  • ios