ప్రయోగాలు చేస్తూ, వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ... లుక్స్ తో లాక్ చేసే విక్రమ్ ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అందుకే కెరీర్ లో ఎన్నడూ లేనిది చేతినిండా సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

చీయాన్ విక్రమ్ ఇప్పుడు సెట్స్ పై రెండు సినిమాలు.. లేదా.. ఒక సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ఐ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. విక్రమ్ డిసప్పాయింట్ కాలేదు. ప్రయోగాలు ఆపలేదు. రీసెంట్ గా ఇంకొక్కడు మూవీతో సక్సెస్ అందుకున్నాడు. లవ్ అనే వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు. ఈ సినిమా కోసం ఆనంద్ శంకర్ అనే యువ దర్శకుడితో పని చేసాడు.

ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.లాస్ట్ ఇయర్ శింబుతో వాలు చిత్రాన్ని తీసిన విజయ్ చందర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. విజయ్ తో సినిమా అనౌన్స్ చేసి కోలీవుడ్ ని సర్ ప్రైజ్ చేసాడు. మరి సామి2 పరిస్థితి ఏంటి అంటే.. విజయ్ తో మూవీ తర్వాతే ఆ చిత్రం చేస్తాడట. విజయ్ చందర్ తో ఏ తరహా చిత్రం చేస్తాడన్నది ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది.

హాలీవుడ్ మూవీ డోన్ట్ బ్రీత్ రీమేక్ కోసమే విజయ్ ను ఎంపిక చేసాడనే టాక్ ఉంది. మొత్తానికి విక్రమ్ సినిమాకు కొత్త దర్శకుడు ఎనౌన్స్ కావడం చియాన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.