Asianet News TeluguAsianet News Telugu

విక్రమ్ నటవిశ్వరూపానికి ముహూర్తం ఫిక్స్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కోబ్రా టీమ్

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటవిశ్వరూపంచూపించబోతున్నారు. విక్రమ్ ప్రయోగాత్మక సినిమా రిలీజ్ కు హుహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇక రిలీజ్ కు ముస్తాబు అవ్వడమే తరువాయి. 
 

Vikram Cobra Movie Releasing On August 11
Author
Hyderabad, First Published Jun 24, 2022, 12:06 PM IST

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటవిశ్వరూపంచూపించబోతున్నారు. విక్రమ్ ప్రయోగాత్మక సినిమా రిలీజ్ కు హుహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇక రిలీజ్ కు ముస్తాబు అవ్వడమే తరువాయి. 

ప్రయోగాలకు పెద్ద పీఠవేసే హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. శివపుత్రుడు,అపరిచితుడు,ఐ లాంటి  సినిమాలతో ఔరా అనిపించాడు విక్రమ్. ఇక ఇప్పుడు అంతకు మించి అంటూ..  ఇంకో  మరో ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కోబ్రా టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈమూవీ రిలీజ్ కు ముహూర్తం ఖరారయ్యింది.  

చియాన్ విక్ర‌మ్ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండడేమో. టాలీవుడ్‌ హీరోల‌కు స‌మానంగా తెలుగులో ఈయ‌నకు క్రేజ్ ఉంది. విక్ర‌మ్ నుండి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీస్తుంటారు. ఇటీవ‌లే అమెజాన్‌లో నేరుగా విడుద‌లైన మహాన్‌ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన లేటెస్ట్ చిత్రం కోబ్రా.  ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను పిక్స్ చేసుకుంది. 

 

కోలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఈ చిత్రం ఒక‌టి. అజ‌య్ జ్ణాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కిన ఈసినిమా . గ‌తంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా...ఈ సినిమా విడుద‌ల పలుమార్లు వాయిదా ప‌డింది. అయితే తాజాగా మేక‌ర్స్ కోబ్రా విడుద‌ల తేదీని ఖరారు చేశారు. అఫీషియల్ గా  ప్ర‌క‌టించారు.

కోబ్రా మూవీ ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించాడు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. ప్ర‌ముఖ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్రలో న‌టించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios