Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్లో దివ్య దగ్గరికి పేషెంట్ తల్లి వచ్చి అతను దొరికారా డాక్టర్ అనడంతో లేదు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. ఏదోలా అతనికి ఈ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది దివ్య. అతను వచ్చాడా అనడంతో మీరు ఇతనితో మాట్లాడుతున్నప్పుడు అతను వెనకనుంచి పారిపోయాడు మేడం అనగా సరే మన సీసీ కెమెరాలు అతను వున్నాడు అతని గుర్తుపట్టు అతనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని అంటుంది దివ్య. మరొకవైపు విక్రమ్ దివ్య మాట్లాడిన మాటలు అనే పదేపదే గుర్తుచేసుకొని సంతోషంగా కారులో ఇంటికి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో రాజ్యలక్ష్మి అందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారు.

 అప్పుడు విక్రమ్ లోపలికి వెళ్లి అమ్మ అని పిలవగా ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో అప్పుడు ఏం జరిగిందా అని విక్రమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడుఅందరూ కలిసి విక్రమ్ ఏదో తప్పు చేసినట్టుగా నిందిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు విక్రమ్ వాళ్ళ మామయ్య అమ్మని ఏడిపించావు బాధపెట్టావు అని అనడంతో నేను ఎప్పటికీ ఆ పని చేయను అని అంటాడు విక్రమ్. అప్పుడు తల ఒక మాట అనడంతో విక్రమ్ ని ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు తను బాధపడకూడదు అనడంతో మరి నువ్వు బాధ పడుతున్నావు కదా మామ్ అని సంజయ్ అనగా అదేం లేదు అంటూ దొంగ ప్రేమను చూపిస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి.

నాన్న నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఏం తప్పు చేయలేదు వెళ్లి ఫ్రెష్ అయ్యి రాపో అని అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడు విక్రమ్ బాధతో నువ్వు ఏదో దాస్తున్నావు నీ నవ్వులో జీవం లేదు ఏదో తప్పు చేశానంటున్నావు చెప్పమ్మా అని అడుగుతాడు విక్రమ్. అప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అనడంతో ఈరోజు అమ్మకు క్యారేజ్ తీసుకుని వెళ్లావు ఇచ్చావా అనడంతో విక్రమ్ జరిగిన విషయాలు అన్ని తలుచుకుని ఆలోచనలో పడతాడు. మొదటిసారిగా నాకు నువ్వు క్యారేజ్ ఇవ్వడం మర్చిపోయావు అనగా మర్చిపోయాను అనడంతో క్యారీ ఇవ్వడం మర్చిపోయావు అనడంతో అమ్మని మర్చిపోయావని అర్థం కదా అని అంటుంది రాజ్యలక్ష్మి.

చిన్న విషయాన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ విక్రమ్ ని మరింత గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి తమ్ముడు నువ్వు ఎందుకు మర్చిపోయావు చెప్పు అనగా అది చెప్పలేని విషయం అని అనుకుంటూ విక్రమ్. ఇప్పుడు ఏ కారణంతో అయితే నువ్వు ఈ పని చేశావు రేపు అదే కారణం మీ అమ్మను నీకు దూరం చేస్తుందని మీ అమ్మ భయపడుతోంది అని విక్రమ్ వాళ్ళ మామయ్య విక్రమ్ ని మరింత భయపెడుతూ టెన్షన్ పెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎప్పటికీ అమ్మకు దూరం కాను ఒకవేళ దూరం అయ్యా అని ఉంటే ఆ రోజు నన్ను నేను దూరం చేసుకున్నట్లే అని అంటాడు విక్రమ్.

 నీ గురించి నాకు తెలుసు నాన్న కానీ ఆ భయం నన్ను మనసులో వెంటాడుతోంది అని దొంగ కన్నీరు కారుస్తుంది రాజ్యలక్ష్మి. అందరూ ఒకటయ్యి విక్రమ్ ని పిచ్చివాడిని చేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి తల్లి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని విక్రమ్ ని మరింత ఎమోషనల్ గా మాట్లాడేలా చేస్తుంది. విక్రమ్ రాజ్యలక్ష్మి మాటలు నిజం అని నమ్మి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తల్లి సెంటిమెంటుతో నాలుగైదు డైలాగులు చెప్పడంతో సంజయ్ వాళ్ళ మామయ్య అత్తయ్య అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు దివ్య వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడు పదేపదే విక్రమ్ ని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

ఎవరో ఆ పిచ్చోడు చేయని తప్పుకు నాకు రెండు లక్షలు ఇచ్చి నాతో మాటలు పడ్డాడు అంటూ విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దివ్య. ఇంతలో తులసి అక్కడికి పాలు తీసుకుని రావడంతో అయ్యో దివ్య పొద్దున అంటే తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి పోతావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఉద్యోగం ఎలా ఉందమ్మా అనడంతో ఉద్యోగం సంగతి పక్కన పెడితే నువ్వు చాలా మారిపోయావు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూతురికి పెళ్లి చేసి పంపిణీ చేసేయాలి అనుకుంటున్నావు అని అంటుంది దివ్య. లాస్య ఆంటీ నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే మా అమ్మ అడ్డుపడి నా వైపు నిలబడేది అలాంటిది నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటుంది దివ్య.

కూతురికి పెళ్లి చేయడం అంటే కూతురికి మరొక జీవితం ఇవ్వడం అని తులసి అనడంతో చదువుకోవడం లేదా కాకుండా పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుంది అన్న దానికి నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్, నువ్వే నా రోల్ మోడల్,జాగ్రత్తలు చెప్పాల్సిన నువ్వే పెళ్లికి తొందర పెడుతుంటే కొత్తగా ఉందమ్మా అని అంటుంది దివ్య. అయినా నేను ఇప్పుడు నిన్ను పెళ్లికి ఓపెన్ చేయడానికి రాలేదు పెళ్లి చూపులకు ఒప్పించడానికి వచ్చాను అని తులసి అనడంతో అమ్మ నేను చిన్నపిల్లనే కానీ చందమామ కథలు నమ్మి ఎంత చిన్న పిల్లని కాదు అని అంటుంది.

 పెళ్లి ఇష్టం లేదు తల్లి అంటే మళ్ళీ పెళ్లిచూపులు అంటావేంటమ్మా అని అంటుంది. నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు నా మాట విని పెళ్లి చూపులకు ఒప్పుకోమ్మా అని అనడంతో పెళ్లిచూపులు తర్వాత కూడా సేమ్ డైలాగ్ ఇదే మాట అంటావు అని అంటుంది దివ్య. నాన్న పరువు కోసమైనా పెళ్లికి ఒప్పుకోమ్మా అని అంటావు అంటుంది దివ్య. నేను ఏమీ మాట్లాడను నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డుపడను నీకు మాట ఇస్తున్నాను అని అంటుంది తులసి. ఒకవేళ అబ్బాయి నచ్చితే అనడంతో చెప్పాను కదా నీ నిర్ణయానికి అడ్డుపడను అని అంటుంది తులసి. పెళ్ళికొడుకు గురించి చెప్పబోతుండగా సరే సరే మామ్ వెళ్ళి పోయి పడుకో పో అని తులసిని పంపిస్తుంది దివ్య.

మరోవైపు రాజ్యలక్ష్మి విక్రమ్ కి నాకంటే ఎవరు ఎక్కువ కాదని తెలుసు కానీ హాస్పిటల్ లో అమ్మను కూడా మరిపించే అంత అందంగా ఎవరు కనిపించారు, అంతా సంఘటన ఏదో జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ అక్కడికి భోజనం తీసుకుని రావడంతో భోజనం తీసుకుని వచ్చాడు అంటే ప్రేమ అలాగే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రాజలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి కావాలనే దొంగ కన్నీరు కారుస్తూ విక్రమ్ ని మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి మాయమాటలు నిజమని నమ్మి ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు.