మహేష్ త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యాడు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ తో ఊపుమీదున్న మహేష్ (Mahesh babu)జోరుకు కరోనా కళ్లెం వేసింది. చక చకా మరో మూవీ చేయాలనుకున్న ఆయన ప్లాన్స్ తలకిందులయ్యాయి. సరిలేరు నీకెవ్వరు విడుదలై రెండేళ్లు అలా గడిచిపోయాయి. ఈ గ్యాప్ పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ తో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేష్ త్రివిక్రమ్ తో 28వ చిత్రం ప్రకటించారు. మరోవైపు రాజమౌళి మూవీ చేయాల్సి ఉంది. రాజమౌళితో చిత్రం అంటే టైం లిమిట్స్ ఉండవు. కనీసం రెండేళ్లు ఆ చిత్రం కోసం కేటాయించాలి.
అందుకే మహేష్ త్రివిక్రమ్(Trivikram) తో మూవీకి కమిట్ అయ్యాడు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. మూవీ త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ కి మహేష్ ఆర్డర్ వేశారట. కాగా ఈ చిత్రంలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హీరోగా విక్రమ్ కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో విక్రమ్ మూవీ చేయడానికి ఒప్పుకొని ఉండొచ్చని అందరూ భావించారు.
అయితే మహేష్ కి విలన్ గా విక్రమ్(Vikram) నటిస్తున్నాడనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అని సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న ఈ వార్తకు బ్రేక్ వేయాలని విక్రమ్ మేనేజర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారట. మహేష్ మూవీలో విక్రమ్ నటిస్తున్నారనేది అవాస్తమన్నారట. వాస్తవంగా చూస్తే మహేష్ కి సమానంగా విక్రమ్ రెమ్యూనరేషన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ విక్రమ్ నటించినా చిత్ర బడ్జెట్ పరిమితులు దాటిపోతుంది. కాబట్టి అది సాధ్యమయేది కాదని చెప్పవచ్చు.
ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేశారు. మహేష్ కి జంటగా మరోసారి పూజా హెగ్డే నటిస్తున్నారు. మహర్షి చిత్రంలో పూజా హెగ్డే మహేష్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కి ఉన్న మరొక విశేషం.. పూజా-త్రివిక్రమ్ లకు ఇది హ్యాట్రిక్ చిత్రం. అరవింద సమేత, అల వైకుంఠపురంలో తర్వాత మహేష్ మూవీ కోసం కలిసి పనిచేస్తున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధం కాగా మహేష్ కోసం రాజమౌళి కథ సిద్ధం చేయిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మహేష్-రాజమౌళి చిత్రానికి కథ సమకూరుస్తున్నారు. ప్రచారంలో సమాచారం ప్రకారం ఇది అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ చిత్రమట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తుండగా ఇన్నేళ్లకు సాకారమైంది.
