'మనసుకు నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం అందరికీ సాధ్యం కాదు. లైఫ్ లో కొంచెం రాజీపడి బతకాలి. తప్పదు.. అయినా నువ్వు అలా అవ్వకూదడనే నీకు నచ్చిన రూట్ ఎంచుకొని హ్యాపీగా బతకాలని చిన్నప్పటి నుండి నీకు అన్నీ ఇస్తూ వచ్చాను.. కానీ నువ్వేమో ఇంటర్వ్యూలకు వెళ్తున్నావ్.. వస్తున్నావ్.. ఎన్ని రోజులు రా ఇలా' అంటూ మురళీశర్మ తన కొడుకుతో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న 'విజేత' చిత్రం టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ తండ్రి పాత్రలో మురళీశర్మ కనిపించనున్నారు. టీజర్ ను సింపుల్ గా కట్ చేశారు. తండ్రి కొడుకుల మధ్య నడిచే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ కు జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది. రాకేశ్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.