టాలీవుడ్ తో పాటు కన్నడ సినిమాల్లో టీవీ షోలలో కనిపించిన నటి విజయలక్ష్మీ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో ఉన్న ఆమె చికిత్సకి సరిపడా డబ్బు లేదని.. ఎవరైనా సహాయం చేయాలని ఇటీవల కోరారు.

ఈ క్రమంలో కన్నడ నటుడు రవి ప్రకాష్ ఆమెకి లక్ష రూపాయల సహాయం అందించాడు. అయితే ఇప్పుడు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయలక్ష్మి. రవిప్రకాష్ ఎప్పుడైతే సహాయం చేశాడో.. అప్పటినుండి తనను మానసికంగా వేధిస్తున్నాడని సంచలన కామెంట్స్ చేసింది విజయలక్ష్మి.

రోజూ ఆమె కోసం ఐసీయుకి రావడం, ఫోన్లో కంటిన్యూస్ గా అసభ్యకరంగా సందేశాలు పంపడంతో భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె చెబుతోన్న విషయాల్లో వాస్తవం లేదని అంటున్నాడు రవిప్రకాష్. అసలు ఆమె పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లిందో అర్ధం కావడం లేదని చెప్పాడు.

శనివారం నాడు పుత్తెనహళ్లిలో పోలీసులను కలిసి జరిగిన విషయాలను వివరించానని వెల్లడించారు. విజయలక్ష్మితో తాను ఏం మాట్లాడరనే విషయాలను సంబంధించిన తన దగ్గర రికార్డ్స్ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.