ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యినట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట రాజమౌళి.  


రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో విశేషాలు గురించి ఏదో ఒక వార్త వస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పడైతే రాజమౌళి ఆస్కార్ గుమ్మం తొక్కారో ఈ పాన్ ఇండియా లెవల్ సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో మహేష్ బాబు పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపిస్తారు అనే వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి-మహేష్ మూవీలో ఆయన పాత్ర హనుమంతుని నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు.సాధారణంగా రాజమౌళి పురాణాలు, రాజుల కాలం స్టోరీలంటే ఇంట్రస్టింగ్ గా ఉంటారు. తన సినిమాలోని పాత్రలను రామాయణ, మహాభారతాల నుంచి ప్రేరణగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు పాత్రను కూడా హనుమంతుని నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు చెప్పారు. అడవి, అడ్వెంచర్ అనగానే కాస్త మసాలా కలిపేసి ఈ హనుమంతుడు క్యారక్టర్ ని లాక్కొచ్చేసారు. అంతేకాకుండా హనుమంతుని లాగా ఈ సినిమాలో హీరో కూడా అసమాన శక్తులు కలిగి ఉంటారని కొందరు డిస్కషన్స్ మొదలెట్టేసారు. అయితే ఇవన్ని కొట్టి పారేసారు ఈ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్.

 మహేష్ రోల్ హనుమాన్ స్పూర్తితో ఉండనుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మహేష్ పాత్రకు ఏ పౌరాణిక పాత్ర రెఫరెన్స్ కాదని వైరల్ అయిన వార్త ఎవరో కావాలని పుట్టించిన వార్త అని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

మరో ప్రక్క ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యినట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట రాజమౌళి. ఈ చిత్రం ఎక్కువగా అమెజాన్ అడవుల్లో చిత్రీకరించబడుతుందని టాక్. ఇక ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు లేదా మూడు పార్ట్ లుగా తీయడానికి చూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళితో చేతులు కలపనున్నారు సూపర్ స్టార్. ఈ సినిమాను 2025 చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.