సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. అయితే, సినిమా విషయంలో జకన్న కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏఢాది ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. మరోవైపు రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ మీట్లలోనూ, ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ‘ఎస్ఎస్ఎంబీ29’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.
ఇప్పటికే మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్ పై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి రిలీల్ అయ్యింది. ‘SSMB29’ బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ ను ఫ్రాంచైజీ లా పలు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారంట. ఈ విషయంలో రాజమౌళి డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకే విజయేంద్ర ప్రసాద్ కూడా తన టీమ్ తో కలిసి కథను డెవలప్ చేసే పనిలో నిమగ్నమయ్యారంట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే మరోసారి వరల్డ్ వైడ్ గా జక్కన్న సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కేలా చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు మన జక్కన్న. దీంతో రాజమౌళి - మహేశ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేళలకు సెట్ అవడంతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. వచ్చే ఏఢాది జూన్ లేదా జూలైలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28లో నటిస్తున్నారు. జనవరి మొదటి వారంలో షూట్ పునఃప్రారంభం కానుంది. మహేశ్ సరసర హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
