విజయదేవరకొండ వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నారు. అయితే అంతా యంగ్ బ్యాచ్ తోనే సినిమాలు చేస్తున్నారు. కొద్దిగా స్పార్క్ కనపడినా తనతో సినిమాకు ఓకే అనేస్తున్నారు. అదే దేవరకొండకు పెద్ద ప్లస్ అవుతోంది. యూత్ పల్స్ ని పట్టే దర్శకులతోనే సినిమాలు చేస్తే నిలబడిపోతామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘హుషారు’ దర్శకుడుకు సినిమా ఇచ్చారు.

‘హుషారు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ హర్ష కొనుగంటి. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం యువత ను బాగా ఆకట్టుకుంది. ఆ విషయం తెలిసిన విజయదేవరకొండ పిలిచి మరీ ఆ సినిమా చూసి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో ఈ దర్శకుడి పరిస్దితి గాల్లో తేలినట్లు ఉంది. దేవరకొండ తో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

తన రెండో చిత్రాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో చేయటం అనేది గొప్ప విషయమే. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక ఆ దర్శకుడుకు తిరుగు ఉండదు. అతి త్వరలోనేఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక హుషారు చిత్రం తమిళ , హిందీ భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రాలకు కూడా శ్రీ హర్ష నే డైరెక్ట్ చేయమని ఆఫర్ వచ్చిన ఆయన నో చెప్పేసి, దేవరకొండతో ముందుకు వెళ్తున్నారు.