దూరమైన భర్త కోసం విజయకాంత్ భార్య ఏం చేసిందో తెలుసా?
నటుడు విజయకాంత్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దూరమైన భర్తను మరచిపోలేకున్న భార్య ప్రేమలత చేసిన పని హాట్ టాపిక్ అవుతుంది.
నటుడు, డిఎండీకే అధినేత విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఒకసారి కోలుకుని తిరిగి వచ్చిన విజయకాంత్ రెండోసారి మాత్రం మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. విజయకాంత్ మరణం తమిళనాడులో సంచలనం రేపింది. అభిమానులు, చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
విజయకాంత్ మరణించి నెల రోజులు దాటిపోతుంది. ఆయన సమాధిని ప్రతిరోజూ అభిమానులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయకాంత్ మరణం భార్య ప్రేమలతను తీవ్రంగా కృంగదీసింది. ఆయన్ని మర్చిపోలేకున్న ప్రేమలత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విజయకాంత్ ఫోటోను తన కుడి చేతిపై టాటూగా వేయించుకున్నారు. భర్తపై ఉన్న అపరిమిత ప్రేమను చాటుకున్నారు.
హేమలత చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. హేమలతను 1990లో విజయకాంత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. షణ్ముగ పాండియన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 90లలో కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా విజయకాంత్ ఉన్నాడు. ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. విజయ్ కెరీర్లో 154 చిత్రాలలో నటించారు.