విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. 

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా ఆందోళన కరంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్‌కాంత్ 80, 90 దశకాల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం విజయ్‌కాంత్ కి చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. 

ఈ నేపథ్యంలో పుకార్లని ఖండిస్తూ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత టైం టు టైం స్పందిస్తూనే ఉన్నారు. అయితే నిన్నటి నుంచి విజయ్‌కాంత్ హెల్త్ పై మరింత ఎక్కువగా ఆందోళన పెరిగిన నేపథ్యంలో ప్రేమలత తాజాగా స్పందించారు. అభిమానుల ఆందోళన తగ్గించేలా ఆమె ఆసుపత్రి నుంచే విజయ్‌కాంత్ ఫోటో రిలీజ్ చేశారు. 

Scroll to load tweet…

'కెప్టెన్ కోలుకుంటున్నారు. త్వరలో కెప్టెన్ పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చి అందరిని చూస్తారు. దయచేసి ఎవరూ వదంతులు నమ్మవద్దు.. ప్రచారం చేయొద్దు అంటూ మనవి చేశారు. ఈ ఆసుపత్రి బెడ్ పై విజయ్‌కాంత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.