చిన్న సినిమాని  పెద్దవాళ్లు ప్రమోట్ చేస్తే జనాల్లోకి వెళ్లటం మాత్రం ఖాయం. అయితే ఎంతగా ఎవరు ప్రమోట్ చేసినా చివరకు జనానికి నచ్చితేనే ఆ సినిమాలు ఆడతాయి. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ లాంటి హీరో ముందుకు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. తాజాగా ఆయన ఈ శుక్రవారం రిలీజైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” పై ప్రశంసలు వర్షం కురిపించాడు.

మరి విజయ్ దేవరకొండ ఇంఫాక్ట్ ఈ చిత్రం కలెక్షన్స్ పై పడి పికప్ అయ్యితే నిర్మాతలు ఒడ్డున పడతారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆరేళ్లకు పైగా ఈ చిత్ర హీరో నవీన్ నాకు బాగా తెలుసు. థియేటర్ లో వర్క్ షాప్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కలసి పనిచేసాము. మళ్లీ ఇప్పుడు ఇలా నవీన్ హీరో అయ్యాక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు కలిసాం చాలా హ్యాపీగా ఉంది.

సినిమా నాకు బాగా నచ్చింది. టెక్నీకల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. స్వరూప్ డైరెక్షన్ అదిరిపోయింది. మ్యూజిక్ అండ్ ఆర్ ఆర్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకు నవీన్ నటన పెద్ద అస్సెట్. నా నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఇదే స్పందన రావడం చూసి సంతోషంగా ఉంది. అలానే నా ఫ్రెండ్ ఇలా సక్సెస్ అయ్యాడని గర్వంగా కూడా ఉంది.

సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా నవీన్ నటనకు ఐ రియల్లీ లవ్డ్. ఇండస్ట్రీలో నవీన్ లాంటి వాడు లేడు అని చెప్పగలను. ఇంకో కొత్త సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. మరిన్ని మంచి సినిమాలు చేస్తూ విజయం సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.