విజయ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఖైదీ సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్  కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. మొదట ఓటీటిల్లో విడుదల చేసే అవకాసం ఉందని వార్తలు వచ్చినా చివరకు ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేసారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం టాక్ తో సంభందం లేకుండా కలెక్షన్స్ లో తన హవా చూపిస్తోంది.  తెలుగు వెర్షన్ కు సైతం బాగానే కలెక్ట్ చేస్తోంది. ముఖ్యంకా తమిళ కలెక్షన్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. హిందీ రీమేక్ కు సైతం రంగం సిద్దమవుతోంది.

 యాభై శాతం ఆక్యుపెన్సీలోనే సినిమా దుమ్ము దులిపుతూండటంతో ఫ్యాన్స్ రియాక్షన్ స్వయంగా చూడాలని విజయ్ పిక్స్ అయ్యారు. అయితే తను వెళితే థియోటర్స్ లో జనం సినిమా చూడటం మానేసి తననే చూస్తూ కూర్చూంటారని తెలుసు. అందుకే ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకోవటానికి నిర్ణయించుకున్న విజయ్..తనెవరో తెలియకుండా ఉండేలా టోపీ పెట్టుకుని, మాస్క్ పెట్టుసుకుని,ముఖం కనపడకుండా దాస్తూ.. చెన్నైలోని దేవి ధియోటర్ కు వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి ఆయన సినిమా చూసారు. ఆయన లోపలకి వచ్చేటప్పుడు అక్కడుండే సిసి క్యామ్ కెమెరాలు రికార్డ్ చేసాయి.  ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    
 
  ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించింది.  అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకులు. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.