Asianet News TeluguAsianet News Telugu

అదరగొడుతున్న విజయ్‌ `వారసుడు` సెకండ్‌ లుక్‌.. సంక్రాంతికి రచ్చ ఖాయం..

`బాస్‌ తిరిగొస్తున్నాడనే` చిత్ర క్యాప్షన్‌ ప్రకారం ఇందులో హీరో విజయ్‌ విదేశాల నుంచి ఊరొస్తున్నట్టుగా ఉంది. మరి వారసుడొచ్చాడనే కాన్సెప్ట్ లో ఈసినిమా కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. విదేశాల్లో 

vijay vaarasudu movie second look released it will blast at sankranthi  in theatre
Author
Hyderabad, First Published Jun 22, 2022, 3:45 PM IST

దళపతి విజయ్‌ పుట్టిన రోజు నేడు బుధవారం (జూన్‌ 22) సందర్భంగా `వారసుడు` చిత్రం బృందం మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈచిత్రం నుంచి మరో పోస్టర్‌ని విడుదల చేశారు. నిన్న మంగళవారం టైటిల్‌ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి `వరిసు` అని తమిళంలో, `వారసుడు` అని తెలుగులో టైటిల్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. నేడు మరో పోస్టర్‌ని విడుదల చేశారు. పండ్లు, కూరగాయలు వంటి సమాను ఊరికి తీసుకొచ్చే వాహనంలో విజయ్‌ పడుకుని ఇచ్చిన స్టయిలీష్‌ పోజ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విదేశాల నుంచి ఊరికి వస్తున్నట్టుగా ఉంది ఈ లుక్. 

`బాస్‌ తిరిగొస్తున్నాడనే` చిత్ర క్యాప్షన్‌ ప్రకారం ఇందులో హీరో విజయ్‌ విదేశాల నుంచి ఊరొస్తున్నట్టుగా ఉంది. మరి వారసుడొచ్చాడనే కాన్సెప్ట్ లో ఈసినిమా కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. విదేశాల్లో చదువుకుని పెద్ద బిజినెస్‌ మ్యాన్‌గా ఎదిగిన హీరో ఊరు రావడానికి కారణమేంటి? ఊర్లో ఏం జరిగింది, వారసుడు వచ్చి ఇక్కడి పరిస్థితులను ఎలా చక్క బెట్టాడనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుందని తాజా `వారసుడు` పోస్టర్లని చూస్తుంటే అర్థమవుతుంది. మొదటి లుక్‌లో విజయ్‌ని బిజినెస్‌ మ్యాన్‌గా చూపించగా, రెండో పోస్టర్‌లో ఆయన్ని ఊరొస్తున్నట్టు చూపించారు. రెండు లుక్‌లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

ఇక విజయ్‌ ఫస్ట్ టైమ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీపైడిపల్లి రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌, పీవీపీ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా రాబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే సంక్రాంతికి భారీ సినిమాలతో పండగ మరింత స్పెషల్‌ కాబోతుందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే నిన్న విడుదలైన ఫస్ట్ లుక్‌ ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌.. రజనీకాంత్‌ నటించిన `కబాలి` చిత్రంతో పోలుస్తున్నారు. ఆ చిత్ర ఫస్ట్ లుక్‌ కూడా అలానే ఉందని, కలర్‌ టోన్‌ నుంచి, విజయ్‌ లుక్‌ వరకు `కబాలి`ని తలపిస్తుందని, ఆ చిత్రం నుంచి కాపీ కొట్టారని కామెంట్లు చేస్తుండటం విశేషం. మరోవైపు ఈ చిత్రం టైటిల్ గతంలో నాగార్జున, ఇవివి సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నుంచి తీసుకున్నారనే సంగతి తెలిసిందే.

 `వారసుడు`లో విజయ్‌, రష్మిక జంటతోపాటు ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి థియేటర్‌లోకి రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios