Asianet News TeluguAsianet News Telugu

Leo Collections : ఫస్ట్ వీక్ పూర్తి.. ‘లియో’ ఎంత వసూల్ చేసిందంటే?

విజయ్ దళపతి ‘లియో’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి వారం సాలిడ్ కలెక్షన్లతో అదరగొట్టిందని తెలుస్తోంది. 
 

Vijay Thalapathy Leo movie 7days Collections NSK
Author
First Published Oct 26, 2023, 1:11 PM IST


తమిళ స్టార్ విజయ్ దళపతి (VijayThalapathy) లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్  LEO. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం నిన్నటితో విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు తొలిరోజు మిక్డ్స్ టాక్ దక్కింది. అయినా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.115 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి తమిళ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ను అందుకుంది. ఆ తర్వాత నుంచీ సినిమాకు మంచి కలెక్షన్లు అందుతున్నాయి. 

ఇక నాలుగు రోజుల్లో ‘లియో’ ప్రపంచ వ్యాప్తంగా రూ.405.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ హ్యాయెస్ట్ వీకెండ్  కలెక్షన్లు అందుకున్న తమిళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక నిన్నటితో ఈ మూవీ ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో ‘లియో’కు అందిన కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయని పలువురు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏడు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూల్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

ఏడోరోజు తమిళనాడు లో రూ.12.9 కోట్లు, కర్ణాటకలో రూ.3.4 కోట్లు, కేరళలో రూ.2.9 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.3.95 కోట్లు, ఇతర ఏరియాల నుంచి రూ3.9 కోట్లు, ఓవర్సీస్ లో రూ.6 కోట్లు కలెక్ట్ చేసిందని అంటున్నారు. అయితే, మిక్డ్స్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతున్న ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్ లో చేరడానికి ఇంకా టైమ్ పడుతుందనీ అంటున్నారు. ఈ లెక్కలపై అఫీషియల్ అప్డేట్ తోనే స్పష్టత రానుంది. 

ప్రస్తుతం దసరాలో విజయ్ ‘లియో’ మంచి వసూళ్లను అయితే రాబడుతోంది. రెండో వారంలోనూ అదే జోరు చూపించనుందని అంటున్నారు. సెకండ్ వీక్ తో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. పార్తిబన్, లియోగా కనిపించారు. రెండు పాత్రల్లోనూ అదరగొట్టారు. చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మాత లలిత్ కుమార్ నిర్మించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios