తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. విజయ్ చివరగా నటించిన సర్కార్ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్. అట్లీ, విజయ్ కాంబినేషన్ లో ఇదివరకే మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు విడుదలయ్యాయి. 

దీనితో దళపతి 63 చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా దళపతి 63 సెట్స్ లో విజయ్ కు ఓ బాలనటుడు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ అక్షిత్ మెర్సల్ చిత్రంలో విజయ్ కొడుకుగా నటించాడు. తన పుట్టినరోజు సందర్భంగా అక్షిత్ విజయ్ సినిమా సెట్స్ కు వెళ్ళాడు. విజయ్ అక్షిత్ ని ఆశీర్వదించి బర్త్ డే గిఫ్ట్ తో అక్షిత్ ని తిరిగి సర్‌ప్రైజ్‌ చేశాడు. అక్షిత్ కి విజయ్ ఓ కెమెరాని బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. 

150 కోట్ల నిర్మాణ వ్యయంతో దళపతి 63 చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మెర్సల్ చిత్రంలో వైద్యరంగంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టిన అట్లీ ఈ చిత్రం ద్వారా క్రీడారంగంలోని రాజకీయాలపై అస్త్రం సంధించబోతున్నట్లు తెలుస్తోంది.