వరుస విజయాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు దళపతి విజయ్. ఆయన గత చిత్రం బిగిల్ భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన బిగిల్, తెలుగులో కూడా మంచి విజయాన్ని  నమోదు చేసింది. కాగా విజయ్ తన లేటెస్ట్ మూవీ మాస్టర్ తో రికార్డుల మోత మొదలెట్టాడు. ఇటీవలే మాస్టర్ టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ లో రికార్డుల దుమ్ముదులుపుతుంది. 

ఇప్పటికే 40మిలియన్ వ్యూస్ దక్కించుకున్న మాస్టర్ టీజర్ 2.4 మిలియన్ లైక్స్ తో సౌత్ ఇండియా రికార్డు కొట్టింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా మాస్టర్ తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. క్లాస్ ప్రొఫెషన్ లో విజయ్ మాస్ లుక్ కేక పుట్టిస్తుంది. మరో హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ గా నటించడం విశేషం. 

గత ఏడాది ఖైదీ మూవీతో భారీ విజయాన్ని నమోదుచేసిన లోకేష్ కనకరాజ్ మాస్టర్ రూపంలో మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్ లో దిగనుంది. మొత్తంగా టీజర్ తోనే రికార్డుల వేట షురూ చేసిన విజయ్, మూవీపై అంచనాలు పెంచేశారు. జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.