ముచ్చటగా మూడోసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఈ మాస్టార్ సినిమాలో విజయ్ తో పోరాడిన మక్కల్ సెల్వన్.. ఈసారి మరోస్టార్ హీరోలో ఢీ కొట్టబోతున్నాడు. మరి విజయ్ చేయబోయే ఈపవర్ ఫుల్ నెగెటీవ్ రోలో కి హీరో ఎవరు.
ముచ్చటగా మూడోసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఈ మాస్టార్ సినిమాలో విజయ్ తో పోరాడిన మక్కల్ సెల్వన్.. ఈసారి మరోస్టార్ హీరోలో ఢీ కొట్టబోతున్నాడు. మరి విజయ్ చేయబోయే ఈపవర్ ఫుల్ నెగెటీవ్ రోలో కి హీరో ఎవరు.
విజయ్ సేతుపతి లాంటి యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు. అందరిలా ఆయన కమర్షియల్ సినిమాలు పట్టుకుని వేళ్ళాడడు. అలా అని అసలు కమర్షియల్ సినిమాలు చేయడా అంటే అది కాదు. కాని తనకు నచ్చిన పాత్ర తగిలినప్పుడు ఆలోచించకుండా ఒప్పేసకుంటాడు. అది హీరో అయినా... విలన్ అయినా.. ఇంకేదైనా... చివరకి హిజ్రా క్యారెక్టర్ అయినా సరే చేయడానికి ఆలోచించడు విజయ్ సేతుపతి
ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సంపాదించికున్నాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే చిన్న సినిమాల్లో కూడా నటించడానికి సిద్దంగా ఉండే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్. ఉప్పెనలో విజయ్ విలనిజంకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ధళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో విజయ్ సేతుపతి ముచ్చటగా మూడో సారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు
నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్, అజిత్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విలన్ గా నటిచమని మేకర్స్ విజయ్‌ను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన కణ్మణి రాంబో ఖతిజా రీసెంట్ గా రిలీజ్ అయ్యిసూపర్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విక్రమ్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
