Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప 2`లో మరో ట్విస్ట్ పెట్టిన సుకుమార్‌, బన్నీ.. రంగంలోకి విజయ్‌ సేతుపతి

విజయ్‌ సేతుపతి సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్రకి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేసి దానికి మెరుగులు దిద్దుతున్నారట సుకుమార్‌.

vijay sethupathi join in pushpa 2 allu arjun sukumar plan just wow
Author
Hyderabad, First Published Jun 28, 2022, 3:37 PM IST

సౌత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. తొలి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగం `పుష్ప 2`పై భారీ అంచనాలున్నాయి. పైగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌ 2` వంటి చిత్రాలు సంచలనాలు క్రియేట్‌ చేసిన నేపథ్యంలో `పుష్ప 2`కి క్రేజ్‌ మరింత పెరిగింది. భారీగా హైప్‌ వచ్చింది. దీంతో హైప్‌కి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. `పుష్పః ది రూల్‌` విషయంలో లెక్కల మాస్టర్‌ బాగా కేర్‌ తీసుకుంటున్నారని, చాలా వరకు మార్పులు చేసి, మరింత భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

రెండో భాగంలో మరింత డోస్‌ పెంచుతున్నారు. బలమైన పాత్రలు క్రియేట్‌ చేస్తున్నారు సుకుమార్‌. అందులో భాగంగా విజయ్‌ సేతుపతిని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విలన్‌గా భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ని దించి సినిమాకి హైప్‌ తీసుకొచ్చారు. మొదటి భాగంలో ఫహద్‌ వచ్చాక సినిమా కథ మరో టర్న్ తీసుకుంటుంది. వేగం కూడా పెరుగుతుంది. అలాగే రెండో భాగంలోనూ కొత్తగా మరో పవర్‌ఫుల్‌ రోల్‌ని సృష్టించారట. దానికి విజయ్‌ సేతుపతిని తీసుకోవాలనుకుంటున్నారట. 

ఇందులో విజయ్‌ సేతుపతి సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్రకి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేసి దానికి మెరుగులు దిద్దుతున్నారట సుకుమార్‌. మరి ఇందులో నిజమెంతో గానీ, విజయ్‌ సేతుపతి ఈ సినిమాలోకి వస్తే దాని రేంజ్‌ మరింతగా పెరిగిపోతుందని, మరో `విక్రమ్‌` తరహా సినిమా కాబోతుందని చెప్పొచ్చు. ఓ వైపు అల్లు అర్జున్‌, మరోవైపు ఫహద్‌, ఇంకోవైపు విజయ్‌ సేతుపతి ఉంటే సినిమా పరుగులు పెట్టడం ఖాయం. అభిమానులకు మంచి ట్రీట్‌నిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మొదట ఇందులో విలన్‌ పాత్రకి విజయ్‌ సేతుపతినే తీసుకున్నా, ఆయనకొన్ని కారణాలతో వైదొలిగారు. ఇప్పుడు మరోసారి ఆయన నటించబోతున్నట్లు తెలుస్తుంది. 

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప :  ది రైజ్’ (Pushpa the rise) పాన్ ఇండియా చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. వంద కోట్లకుపైగా కలెక్షన్లు నార్త్ నుంచి రావడం విశేషం. అల్లు అర్జున్ పుష్ప కేరక్టరైజేషన్ ప్రేక్షకులకు మ్యానియాగా మారింది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటించింది. రెండో భాగంలో ఆమె పాత్ర మధ్యలోనే చనిపోతుందని టాక్‌. అంతేకాదు అనసూయ, ధనుంజయ పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందట. 

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. కానీ వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు. సినిమాని భారీ స్కేల్‌లో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న నేపథ్యంలో బాగా టైమ్‌ తీసుకుంటుందని, 2024లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తుంది. సినిమాకి ఖర్చు విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు నిర్మాతలు. ఇండొనేషియా , సింగపూర్లలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ ను పెట్టబోతున్నట్టు సమాచారం.  అక్టోబర్‌లో షూటింగ్‌ స్టార్ట్ కానుందని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios