కథానాయకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కన్నా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. అలాంటి నటుల కెరీర్ కి ఏ మాత్రం డోకా ఉండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించే అవకాశం కూడా దక్కుతుంది. అలంటి అతి కొద్ది మంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. 

కథ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. లేకపోయినా సినిమాలో విజయ్ సేతుపతి కనిపిస్తే చాలు ఆ కథకు ఒక బలం వచ్చినట్టే.డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకునే ఈ స్టార్ యాక్టర్ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ కి కూడా తాకింది. టాలీవుడ్ మెగాస్టార్ సైరా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సరసన కూడా నటించనున్నట్లు తెలిసింది. 

ఇటీవల మెల్ బోర్న్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో విజయ్ ఈ విషయంపై స్పందించాడు. అమీర్ ఖాన్ తో త్వరలోనే ఒక సినిమాలో నటించబోతున్నట్లు చెబుతూ.. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మాట్లాడటం బావుండదని త్వరలోనే అందరికి తెలుస్తుందని అన్నారు. ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ ని అమీర్ రికమండ్ చేశాడట. అయితే ఆ ప్రాజెక్ట్ ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అమీర్ లాల్ సింగ్ చందా అనే పాత్రలో కనిపిస్తాడని సమాచారం.