Asianet News TeluguAsianet News Telugu

వెంకటేష్ ప్లాన్ ని దెబ్బకొడుతున్న విజయ్!

తమిళ స్టార్ హీరో విజ‌య్ తాజా చిత్రం `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ ద‌ర్శ‌కుడు. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Vijay's Bigil to offset Venky Mama's plans
Author
Hyderabad, First Published Sep 11, 2019, 10:45 AM IST

పండగ సీజన్ లో సినిమాలు రిలీజ్ లు పెట్టుకుంటే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. శెలవులు సినిమాకు కలిసొస్తాయి. టాక్ కు సంభంధం లేకుండా థియోటర్స్ హౌస్ ఫుల్స్ అవుతాయి. మొన్న సాహో చిత్రం కూడా వినాయిక చవతి శెలవులను క్యాషష్ చేసుకుంది. అదే మాదిరిగా దీపావళి రోజున సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమావాళ్లు ఉత్సాహపడుతున్నారు. తెలుగులో వెంకీ మామ సినిమాని దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా వెంకీ మామకు తమిళ హీరో విజయ్ నుంచి సమస్య ఎదురు అవుతోంది.

తమిళ స్టార్ హీరో విజ‌య్ తాజా చిత్రం `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) కూడా దీపావళి రిలీజ్ కు రెడీ అవుతోంది. అట్లీ ద‌ర్శ‌కుడు. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.   రెండు పాత్ర‌ల్లో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్రట‌. ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేస్తున్నారు.

 విజయ్ కు తెలుగులో కూడా చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఆయన గత చిత్రం మెర్సల్ ...తెలుగులో అదిరింది టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.  `తెరి`, `మెర్స‌ల్` చిత్రాల త‌ర్వాత విజ‌య్ ,అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం కావ‌డంతో `బిగిల్` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దాంతో వెంకీ మామ టీమ్ ఇప్పుడు ఆలోచనలో పడిందిట. ధైర్యం చేసి విజయ్ సినిమాపై వేద్దామా అంటే థియోటర్స్ సమస్య ఇద్దరికీ వస్తుంది. ఇద్దరూ థియోటర్స్ పంచుకోవాలి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ సొంత సినిమా కాబట్టి మంచి థియోటర్స్ అన్ని వెంకీ మామకే దక్కుతాయనటంలో సందేహం లేదు. విజయ్ సినిమాని వాయిదా వెయ్యాలంటే తమిళంలోనూ రిలీజ్ డేట్ మార్చాలి. అది జరిగే పని కాదు. కాబట్టి తెలుగువాళ్లకు ఒకే రోజు రెండు సినిమాలు పండగ గా ఈ దీపావళి మారనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios