ప్రముఖ కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన ఇటీవల బ్యాంకాక్ లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పిన్న వయసులోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.

ప్రముఖ కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన ఇటీవల బ్యాంకాక్ లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పిన్న వయసులోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. విజయ్ రాఘవేంద్ర, స్పందన ఇద్దరూ ఫ్యామిలీతో కలసి తమ 16 వ వెడ్డింగ్ యానవర్సరీ జరుపుకునేందుకు బ్యాంకాక్ వెళ్లారు. వారి వెంట ఫ్యామిలీ, స్నేహితులు కూడా కొందరు ఉన్నారు. 

అయితే విజయ్ రాఘవేంద్ర తన భార్య మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నాడు. తొలిసారి విజయ్ రాఘవేంద్ర తన భార్య మృతిపై స్పందించారు. 'స్పందన చివరి క్షణాలు ఎంతో భయంకరంగా మారాయి. ఆ దృశ్యాలని నేను ఎప్పటికి మరచిపోలేను. బ్యాంకాక్ కి వెకేషన్ కి వెళ్లాం. బసచేసిన హోటల్ లో చెక్ అవుట్ చేసే రోజున ఉదయాన్నే నేనే స్పందనని నిద్ర లేపాను. 

కానీ స్పందన స్పృహలో లేకపోవడంతో నాకు కంగారు మొదలయింది. పల్స్ కూడా బాగా పడిపోయింది. దీనితో నా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. కానీ వేంటనే తేరుకుని ఆసుపత్రికి తీసుకెళ్లా. కానీ అప్పటికే స్పందన మరణించింది అని వైద్యులు చెప్పారు. మనకి ఇష్టమైన వారు కళ్ళముందే మరణిస్తే ఆ భాద ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. అలాంటి వేదన నేను కూడా అనుభవించా. 

స్పందన మృతితో నేను అనుభవిస్తున్న కష్టం ఎవరికీ రాకూడదు. లోపల వేదన ఉన్నప్పటికీ బయటకి చిరునవ్వుతో కనిపిస్తున్నా. కానీ నా కొడుకు ముందు మాత్రం ఆ విధంగా ఉండలేకున్నా. ఎందుకంటే వాడిని చూస్తుంటే నాకు స్పందన గుర్తుకు వస్తోంది అని విజయ్ రాఘవేంద్ర అన్నారు. 

స్పందన నటిగా కూడా కొన్ని చిత్రాలు చేసింది. ఆ తర్వాత తన భర్త చిత్రాలకు నిర్మాతగా మరి ప్రొడక్షన్ పనులు చూసుకునేది. ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. శౌర్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. 

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. పునీత్ 2021లో గుండె పోటు కారణంగానే మరణించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ రాఘవేంద్ర నటుడిగా రాణిస్తున్నారు. చిన్నారి ముఠా చిత్రంలో నటనకి గాను విజయ్ రాఘవేంద్ర జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. విజయ్ మల్టీ ట్యాలెంటెడ్ హీరో. సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడారు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఇక స్పందన మాజీ పోలీస్ అధికారి శివరామ్ కుమార్తె. ఆమెని ప్రేమించి విజయ్ వివాహం చేసుకున్నారు.