విజయ్ చావుకు కారణం ఆమెయే : విజయ్ తల్లి

విజయ్ చావుకు కారణం ఆమెయే : విజయ్ తల్లి

సినీ నటుడు విజయ్ ఆత్మహత్య ఘటన తెలుగు ఇండస్ట్రీల్లో విషాదం నిపింది. అయితే ఈ ఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం డిప్రెషన్ వచ్చిందనేది వాస్తవం కాదని, అసలు కారణం వేరని, కుటుంబ కలహాలే అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది.

 

తన కొడుకు చావుకు కారణం కోడలు వనిత అని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారని, ఆమె చేస్తున్న పనుల వల్లే తన కొడుకు మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు. తమ ఇంటి నుండి నగలు, డబ్బు, ఖరీదైన చీరలు అన్ని కోడలు తీసుకెళ్లిందని, అయినా తాము ఏనాడు ఆమెను ఏమీ అనలేదని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. తాము ఇన్నాళ్లు ఎలాంటి మాట పడకుండా జీవిస్తున్నామని, కానీ తన కోడలు తమను బజారుకు లాగిందని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. ఆమె కారణంగా తన కొడుకు విజయ్ చాలా కుమిలిపోయేవాడని తెలిపారు.

 

రెండు రోజుల క్రితం లాయర్, మెకానిక్‌తో తన కోడలు ఇక్కడికి వచ్చిందని, కారు కూడా తీసుకెళ్లిందని విజయ్ తల్లి తెలిపారు. తన కొడుకు బయటకు వెళ్లి వచ్చి కారు ఏమైందని అడగటంతో జరిగిన విషయం చెప్పానని, అప్పటి నుండి మరింత కుమిలి పోయాడని ఆమె తెలిపారు. తన భార్య చేసిన పనులకు విజయ్ సాయి తరచూ బాధ పడుతుండేవాడని, ఇలా అయితే ఎలా అని మేము ఎంతో నచ్చజెప్పామని, ఆ బాధతోనే సినిమాలు కూడా సరిగా చేయడం లేదని విజయ్ తల్లి మీడియాకు తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page