నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి... నేను ఎవరికి చెందిన వాడినో తెలియదు - ఓ అజ్ఞాత గూఢచారి' ' అని పోస్టర్ మీద రాసి ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ కోట్ పేర్కొన్నారు. 


ఇప్పుడు యాక్షన్ సినిమా అంటే డ్రగ్స్, గ్యాంగస్టర్ కథలే కేరాఫ్ గా వస్తున్నాయి. అలాంటి వాటికే యూత్ నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన తాజా చిత్రంలో గ్యాంగస్టర్ వరల్డ్ లో చెలరేగిపోయే ఓ కుర్రాడుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే..

 విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), జెర్సీ" ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanuri) డైరెక్షన్ లో VD12 చిత్రం రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి వార్తలు బయిటకు వస్తున్నాయి. ఈ స్టోరీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది. ఓ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో 'నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి... నేను ఎవరికి చెందిన వాడినో తెలియదు - ఓ అజ్ఞాత గూఢచారి' అని పోస్టర్ మీద రాసి ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ కోట్ పేర్కొన్నారు. ఈ రోజు స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా 'ప్రతి గూఢచారి కథ ముగియడం వెనుక ఓ గూడుపుఠాణి ఉంటుంది. అయితే, వారి వెనుక ఉన్న నిజం ఎప్పటికీ బయటకు రాదు' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ కామెంట్స్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. గూఢచారిగా విజయ్ దేవరకొండ కథ ఏమిటి? ఆ నిజం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే... సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. 

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కలయికలో తొలి చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తూండటంతో అంచనాలు పెరిగిపోయాయి. వీరి నుంచి వచ్చిన జెర్సీ మూవీలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కాంబోలో అద్దిరిపోయే సాంగ్స్, గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ..సమంత 'ఖుషి' మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం.మలయాళం,హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.