టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఏడాదితో ఆయనకి ముప్పై ఏళ్లు వచ్చాయి. దీంతో అతడి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికైతే విజయ్ కి పెళ్లి ఆలోచన లేదట. కానీ ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని బాగా ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

తన తల్లి మరో రెండేళ్లలో పెళ్లి చేసుకొని, పిల్లల్ని కను అంటూ అతడిపై ప్రెషర్ పెడుతుందట. దీనిపై విజయ్ మాట్లాడుతూ.. ''వాడెవడికోసమో నేను పెళ్లి చేసుకోవాలా..? వాడెవడో ఎప్పుడో వస్తాడని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా..? అనిపించింది నాకు'' అంటూ చెప్పుకొచ్చింది. 

అయితే తను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పాడు. తన మైండ్ లో కొందరు ఉన్నారని అన్నాడు. ఇది ఇలా ఉండగా.. ఫారెన్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా.. 'మే బీ' అంటూ బదులిచ్చాడు.

ప్రేమ, పెళ్లి విషయాల్లో తనకు క్లారిటీ ఉందని చెప్పిన ఈ హీరో.. సహజీవనానికి తను వ్యతిరేకినని తెలిపారు. ప్రస్తుతం ఈ హీరో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.