టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ  రోజు రోజుకీ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో బిజీగా ఉంటన్న సంగతి తెలిసిందే.  వరసపెట్టి అర్జున్‌ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో మెప్పించిన విజయ్‌ నోటా సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టేశాడు. అదే ఊపులో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు  రెడీ అవుతున్నట్టుగా వార్తలు మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది.

ఇక జాన్వీ కపూర్‌తో చేసే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని, విజయ్‌ని కరణ్‌ జోహార్‌ పరిచయం చేస్తారని బాలీవుడ్ మీడియా హోరెత్తించేసింది. అయితే తాజాగా ‘83’ చిత్రం ద్వారా విజయ్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని తెలుగు మీడియా హైలెట్ చేసింది.  

1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ రూపొందించనున్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సౌత్‌ ఇండియన్‌ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రను పోషిస్తారని వినపడింది. అంటే ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తారనే ఆ వార్త సారాంశం. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్‌కు లేదని తెలుస్తోంది.  ఓ భారీ చిత్రంలో విజయ్‌ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యింది అనేది అబద్దమని, అటువంటి చిన్న పాత్రలతో బాలీవుడ్ కు వెళ్లాలని లేదని విజయ్ తేల్చి చెప్పేసాడట.  ఇది బాలీవుడ్ కు విజయ్ వెళ్తాడని ఆనందపడుతున్న అభిమానలకు ఊహించని షాక్ అనే చెప్పాలి. 

ఇక ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ సినిమా  షూటింగ్ సమయంలో గాయపడ్డారాయన. రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కే సన్నివేశాల్లో స్లిప్‌ అవ్వడంతో విజయ్‌ చేతికి చిన్నపాటి గాయమైంది.