బెట్టింగ్ యాప్స్ విషయంలో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు విచారణకు విజయ్ దేవరకొండ హాజరుకాబోతున్నారు.
KNOW
బెట్టింగ్ యాప్స్ కేసులో స్టార్ సెలబ్రిటీలు
టాలీవుడ్ సెలబ్రిటీలను ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టు ముడుతూనే ఉంది. గతంలో మాదకద్రవ్యాల కేసలు, తాజాగా బెట్టింగ్ యాప్ వివాదం. ఈ కేసు సినిమా స్టార్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇందులో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, రానా, శ్యామల, లాంటి వెండితెర బుల్లితెర సెలబ్రిటీలు, పలువురు యూట్యూబ్ స్టార్లు, యాకర్ల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టి, ఒక్కొక్కరిని విడిగా విచారిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ కు ఈ విషయంలో నోటీసులు కూడా అందాయి.ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ వంతు వచ్చింది.
విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్
బెట్టింగ్ యాప్స్ విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించింది ఈడీ. గత నెల 30 న ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ మొదటి నుంచి పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు. విచారణ తరువాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని, వాటిజోలికి వెళ్లని ప్రకాష్ రాజ్ తెలిపారు .
ఈరోజు విచారణకు విజయ్ దేవరకొండ
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం అయ్యింది. ఒక్కొక్కరుగా స్టార్స్ ఈడీ ముందు హాజరవుతున్నారు. ఇక ఈ కేసులో నేడు( అగస్ట్6) ఈడీ విచారణకు నటుడు విజయ్ దేవరకొండ రానున్నారు. గతంలోనే వీరిని విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా.. షూటింగ్స్ వల్ల రాలేమని ఆయన బదులు ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండకు 6 తేదీన రావల్సిందిగా మరో నోటీసు అందించింది ఈడీ. ఈక్రమంలో విజయ్ ఈరోజు విచారణకు హాజరవుతారా, విజయ్ ను ఎటువంటి ప్రశ్నలు వేస్తారు. ఆతరువాత విజయ్ ఏవిధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈసినిమా హిట్ అవ్వడంతో విజయోత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రానా, మంచు లక్ష్మీ కూడా
మరోవైపు టాలీవుడ్ నటుడు రానా కు కూడా గతంలోనే విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే రానా కూడా షూటింగ్స్ ఉండటంవల్ల రాలేను అని సమాధానం పంపించారు. ఈక్రమంలో రానాకు ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని మరో సారి నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో నటి నిధి అగర్వాల్ సహా పలువురు సినీరంగానికి చెందిన వారు ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
