టాలీవుడ్ ని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. పెద్ద సినిమాలతో పాటు క్రేజ్ ఉన్న చిన్న సినిమాలకు కూడా ఈ పైరసీ బాధలు తప్పడం లేదు. దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ నటించిన 'టాక్సీవాలా' కూడా పైరసీకి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. తాజగా ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది ఆకతాయిలు మొబైల్ లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కేసు నమోదు చేసి వారికి సినిమా ఎక్కడ నుండి వచ్చింది..? ఎవరెవరికి ఈ సినిమా ఫార్వార్డ్ చేశారనే విషయాలు తెలుసుకుంటున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావల్సివుంది. కానీ గ్రాఫిక్స్ పనుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.