Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ కు గాయాలు

క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ  తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సైట్స్ పై గాయపడ్డారు. అయితే అంత పెద్ద దెబ్బలేమీ కాదు. మైనర్ గానే గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ తన ఇనిస్ట్రగ్రమ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియచేసారు.

Vijay Deverakonda Suffers Injuries
Author
Hyderabad, First Published Dec 17, 2018, 9:25 AM IST

క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ  తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సైట్స్ పై గాయపడ్డారు. అయితే అంత పెద్ద దెబ్బలేమీ కాదు. మైనర్ గానే గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ తన ఇన్స్టాగ్రమ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియచేసారు.

కదులుతున్న ట్రైన్  ఎక్కబోయి పడి ఈ గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. జీవితంలో ఏదీ ఊరికే రాదు అంటూ కామెంట్ చేస్తూ ఫొటో పెట్టారు.

ఇక  విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని విలక్షణ నటుడిని మనందరికీ పరిచయం చేశాడు. అర్జున్ రెడ్డిలోని  తన పాత్రకున్న ఆటిట్యూడ్ వల్ల యూత్ కి తెగ నచ్చేసి ఓవర్  నైట్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తరువాత నటించిన సినిమాల్లో మహానటి కూడా బాగా కలిసి వచ్చింది. ఇందులో జర్నలిస్ట్ మధురవాణికి సహాయకుడిగా విజయ్ ఆంటోని పాత్రలో కనిపించి అదరకొట్టాడు. 

ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో చేసిన గీతా గోవిదం గురించి అయితే చెప్పక్కర్లేదు. రిలీజ్ కు ముందే పైరసీ రిలీజ్ అయిన టాక్సీ వాలా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఈ నేపధ్యంలో బిగ్ బెన్ మూవీస్, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నారు.  టైటిల్ చూస్తుంటే విప్లవాత్మకమైన చిత్రంగా హింట్ ఇస్తోంది. అయితే ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అనితెలుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios