సినిమాపై మంచి బజ్ ఉంది. దాంతో అదిరిపోయే ఓపినింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు నైజాం ఏరియాలో మంచి గ్రిప్ ఉంది.
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో రూపొందిన ఖుషీ మూవీ నిన్న శుక్రవారం రోజు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. సినిమాకు యావరేజ్ టాక్ నడుస్తోంది. నానితో చేసిన టక్ జగదీష్ సినిమా డిజాస్టర్ తరువాత శివ నిర్వాణ.. ‘ఖుషి’ చేసేందుకు ఫ్లాప్స్‌లో ఉన్న అటు సమంత, విజయ్ దేవరకొండల్ని ఒప్పించి ఈ సినిమా చేసారు. అయితే అంతకు ముందు నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాలను తీశారు శివ నిర్వాణ రొమాంటిక్ గా నడిచే ఎమోషన్ సీన్స్ ని బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్నారు. దాంతో సినిమాపై మంచి బజ్ ఉంది. దాంతో అదిరిపోయే ఓపినింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు నైజాం ఏరియాలో మంచి గ్రిప్ ఉంది. గీతాగోవిందంతో ఓవర్ సీస్ లోనూ మార్కెట్ రెట్టింపు అయ్యింది.
ఈ క్రమంలో #KushiMovie నైజాం మొదటి రోజు జిఎస్టీతో కలిపి 5.12 కోట్లు వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ ఈ చిత్రం నమోదు చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రం యూఎస్ లో ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేయగా మరి మేకర్స్ అఫీషియల్ గా అయితే డే 1 నాటికి 6 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా మొత్తం డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఈజీగా 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని యూఎస్ లో రాబట్టే దిశగా వెళ్తుంది అని చెప్పాలి.
ఖుషీ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఖుషి సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. పాటలతోనే ఈ చిత్రానికి మంచి ప్రమోషన్లు జరిగాయి. ఖుషి సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను కూడా చిత్ర యూనిట్ నిర్వహించలేదు. దానికి బదులుగా గ్రాండ్‍గా ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ జరిపింది.టైటిల్ సాంగ్ సహా నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి.
విజయ్ దేవరకొండ గత చిత్రం లైగర్ పాన్ ఇండియా రేంజ్‍లో ఫ్లాఫ్ అయినా.. దాని ఎఫెక్ట్ ఖుషి చిత్రంపై పడినట్టు కనిపించడం లేదు. వీకెండ్ లో ఖుషి సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అన్నిచోట్లా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‍లు జోరుగా సాగుతున్నాయి. హిందీలోనూ ఖుషికి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. నార్త్‌లోనూ ఈ సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడులోనూ బుకింగ్స్ ఊహించిన దాటి కంటే ఎక్కువగా అవుతున్నాయని తెలుస్తోంది.
