Asianet News TeluguAsianet News Telugu

అన్న విజయ్‌ దేవరకొండ రికార్డుని బద్దలు కొట్టిన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ..

`బేబీ` సినిమాతో రికార్డులను బద్దలు కొట్టాడు తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ. ఇన్నాళ్లుగా హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఆనంద్‌కి బిగ్గెస్ట్ బ్రేక్‌, హిట్‌, రికార్డు దక్కింది. 

vijay deverakonda records break by bother anand deverakonda arj
Author
First Published Jul 27, 2023, 3:06 PM IST

విజయ్‌ దేవరకొండకి కెరీర్‌ పరంగా పెద్ద బ్రేక్‌ ఇచ్చిన మూవీ `అర్జున్‌ రెడ్డి`. ఆయన అంతకు ముందు `బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ`, `ఎవడే సుబ్రమణ్యం`, `పెళ్లి చూపులు` చిత్రాల్లో నటించాడు. `పెళ్లి చూపులు` విజయం సాధించింది. తనకు బూస్ట్ ఇచ్చింది. కానీ కెరీర్‌ పరంగా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది మాత్రం `అర్జున్‌రెడ్డి` అనే చెప్పాలి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మెడికో లవ్‌ స్టోరీ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అత్యంత బోల్డ్ ఫిల్మ్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్‌ హిట్‌ అయ్యింది. అప్పట్లోనే ఇది యాభై కోట్లు వసూలు చేసింది. యాభై కోట్ల ఫిల్మ్ అంటే ఆ టైమ్‌లో పెద్ద రికార్డుగానే పరిగనిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టాడు తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ. ఇన్నాళ్లుగా హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఆనంద్‌కి బిగ్గెస్ట్ బ్రేక్‌, హిట్‌, రికార్డు దక్కింది. ఆయన `బేబీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌తోపాటు వైష్ణవి హీరోయిన్‌గా నటించగా, విరాజ్‌ అశ్విన్ మరో హీరోగా నటించారు. ఈ నెల 24న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. కల్‌ లవ్‌ స్టోరీగా నిలుస్తుంది. 

ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా డెబ్బై కోట్ల గ్రాస్ ని దాటింది. ఈ లెక్కన సినిమా సుమారు 40కోట్ల నెట్‌ సాధించింది. అంటే బడ్జెట్‌కి మూడు రెట్లు అధికంగా వసూళ్లని సాధించి, నిర్మాత ఎస్‌కేఎన్‌, మారుతిలకు కాసుల వర్షం కురిపించింది. కష్టకాలంలో ఎన్నో అడ్డుంకులను ఎదుర్కొని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని తీసిన సినిమా ఇది. వాళ్ల ఆకలి తీర్చేసింది. కసిని ఫుల్‌ఫిల్‌ చేసింది. ఇంకా థియేటర్లలో అంతే సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుందీ మూవీ. 

అంతేకాదు థియేట్రికల్‌ సక్సెస్‌ కోసం తపిస్తున్న ఆనంద్‌ దేవరకొండకి బిగ్ బ్రేక్‌నిచ్చిందని చెప్పొచ్చు. హీరోగా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ముందు `దొరసాని`, `మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌`, `పుష్పక విమానం` చిత్రాలు సో సోగా ఆడాయి. ఓటీటీలో రావడంతో అవి వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు `బేబీ` సినిమా ఆనంద్‌కి కమర్షియల్‌ బ్రేక్‌నివ్వడంతోపాటు హీరోయిన్ వైష్ణవికి పాపులారిటీని తీసుకొచ్చింది. అలాగే విరాజ్‌కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో ఒకప్పుడు విజయ్‌ దేవరకొండకి `అర్జున్‌ రెడ్డి` ఎలాగో, ఇప్పుడు ఆనంద్‌కి `బేబీ` అలాంటి సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో అన్న అర్జున్‌రెడ్డి రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios