ప్రభాస్‌, రానాల తర్వాత హిందీలో ఆ ఘనత సాధించిన హీరోగా విజయ్‌ దేవరకొండ నిలిచారు. ఆయన తాజాగా `కాఫీ విత్‌ కరణ్‌` రియాలిటీ టాక్‌ షోలో పాల్గొన్నారు.

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) మరో ఘనత సాధించారు. పాన్‌ ఇండియాస్టార్‌ ప్రభాస్‌(Prabhas), రానాల తర్వాత హిందీలో ఆ ఘనత సాధించిన హీరోగా విజయ్‌ దేవరకొండ నిలిచారు. ఆయన తాజాగా `కాఫీ విత్‌ కరణ్‌`(Koffee with Karan) రియాలిటీ టాక్‌ షోలో పాల్గొన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా హిందీలో `కఫీ విత్‌ కరణ్‌` షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ఏడో సీజన్‌ ఓటీటీలో `డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌`లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ షూటింగ్లు ప్రారంభమయ్యాయి. 

ఇందులో పాపులర్‌సెలబ్రిటీలు పాల్గొని తమ లైఫ్‌లోని,కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటారు. సెలబ్రిటీల సీక్రెట్లని బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కరణ్‌ జోహార్‌. లవ్‌ ఎఫైర్స్, స్ట్రగుల్స్ ఇలా అన్నింటిని నెమ్మదిగా లాగుతూ సెన్సేషన్‌ చేస్తుంటారు. ఇది దేశ వ్యాప్తంగా చాలా పాపులర్‌ అయ్యింది. ఇండియన్‌ టాప్‌ సెలబ్రిటీలు ఇందులో పాల్గొంటుంటారు. దీంతో అందరి దృష్టి దీనిపై పడుతుంటుంది. అయితే ఈసారి ఓటీటీలో దీన్ని ప్రసారం చేస్తుండటం గమనార్హం. 

ఏడో సీజన్‌ లో మొదటి గెస్ట్ గా విజయ్‌ దేవరకొండ పాల్గొన్నట్టు తెలుస్తుంది. తాజాగా విజయ్‌ `కాఫీ విత్‌ కరణ్‌` టాక్‌ షోలో పాల్గొన్నట్టు ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. కాఫీ కప్‌పై విజయ్‌ దేవకొండ, కాఫీ విత్‌ కరణ్‌ సైన్‌ పెట్టిన రెండు కప్పులతో కూడిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో ఆయన బాలీవుడ్‌ హీరోయిన్‌ `లైగర్‌` బ్యూటీ అనన్య పాండేతో కలిసి పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కానున్న నేపథ్యంలో వీరిద్దరు కరణ్‌ జోహార్‌ షోలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. 

అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొన్న రెండో స్టార్‌గా విజయ్‌ దేవరకొండ నిలిచారు. మొదట `బాహుబలి`సినిమా విడుదల సమయంలో టీమ్‌ ప్రభాస్‌, రానా, రాజమౌళి, అనుష్కలు కలిసి ఈషోలో పాల్గొన్నారు. అదొక ప్రమోషనల్‌ ఈవెంట్‌లా జరిగింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ షోలో పాల్గొన్న హీరోగా విజయ్‌ దేవరకొండ నిలవడం విశేషం. ఆయన నటించిన `లైగర్‌` చిత్రాన్ని తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించారు. హిందీలో కరణ్‌ జోహార్‌ నిర్మాత. ఈ నేపథ్యంలో ఆయన షోలో విజయ్‌ పాల్గొనడం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మరి విజయ్‌ ఇందులో ఏం చెప్పబోతున్నారనేది మరింత ఆసక్తినెలకొంది. ఈ ఎపిసోడ్‌ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

Scroll to load tweet…

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `లైగర్‌` చిత్రాన్ని కంప్లీట్‌ చేశాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్‌ జోహార్‌ కలిసి నిర్మించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ ముంబయిలో గల్లీలోని కుర్రాడు బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎదిగే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. మరోవైపు పూరీతోనే `జనగణమన` చిత్రంలో నటిస్తున్నారు విజయ్. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి `ఖుషి`సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.