విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జోడీ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ రాబోతుంది. `ఫ్యామిలీ స్టార్‌` సినిమాలో నేషనల్‌ క్రష్‌ మెరవబోతుందట. త్వరలోనే ఆ సర్‌ప్రైజ్‌ రాబోతుంది. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ జోడీగా సినిమా చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అదిగో ఇదిగో అనేలా వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య రష్మిక మందన్నా కూడా తామిద్దరం కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ కోరిక తీరబోతుందట. ఇద్దరు కలిసి రచ్చ చేయబోతున్నారట. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న `ఫ్యామిలీ స్టార్‌` సినిమా విషయంలోనే అది జరగబోతుందట. 

పరశురామ్‌ దర్శకత్వంలో `ఫ్యామిలీ స్టార్‌` మూవీ రూపొందుతుంది. వచ్చే నెలలో ఇది విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే ఓ పాటని విడుదల చేశారు. అది ట్రెండ్‌ అయ్యింది. ఇప్పుడు మరో పాటని విడుదల చేయబోతున్నారు. తాజాగా `కళ్యాణి వచ్చా వచ్చా` అనే పాట ప్రోమోని విడుదల చేశారు. పూర్తి పాటని ఈ సాయంత్రం విడుదల చేయబోతున్నారు. 

అయితే `ఫ్యామిలీ స్టార్‌`లో రష్మిక మందన్నా కనిపించబోతుందట. ఈ విషయం గతంలోనూ వినిపించింది. ఓ పాటలో మెరుస్తుందనే రూమర్ అప్పట్లో వినిపించింది. మృణాల్‌ ఠాకూర్‌తోపాటు రష్మిక కూడా ఓ పాటలో కనిపిస్తారని అన్నారు. తాజాగా ఈ రోజు విడుదల కాబోతున్న `కళ్యాణి వచ్చా వచ్చా` పాటలోనే నేషనల్‌ క్రష్‌ మెరవబోతుందట. ఈ పాటలో మృణాల్‌, విజయ్‌ల పెళ్లి సన్నివేశాలు చూపించబోతున్నారు. అందులో రష్మిక మెరుస్తుందని, ఆమె డాన్సు చేస్తుందని అంటున్నారు. అంటే విజయ్‌ పెళ్లికి రష్మిక డాన్సు అన్నమాట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Read more: మొగుడి కోసం లవర్‌ని వదిలేసిన రష్మి పతివ్రతనా?.. జబర్దస్త్ యాంకర్‌ అసలు రూపం బయటపెట్టిన కమెడియన్‌

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్‌`కి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌ రాజు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పుడు సాయంత్రం రెండో పాటని పూర్తిగా రిలీజ్‌ చేయబోతున్నారట. త్వరలోనే మిగిలిన పాటలు, ఆ తర్వాత ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పరశురామ్‌ రూపొందించిన `గీత గోవిందం`లో విజయ్‌, రష్మిక కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సెంటిమెంట్‌తో `ఫ్యామిలీ స్టార్‌`లో రష్మికని గెస్ట్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. 

Also read: హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. రహస్య ప్రేమ బహిర్గతం..