MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మొగుడి కోసం లవర్‌ని వదిలేసిన రష్మి పతివ్రతనా?.. జబర్దస్త్ యాంకర్‌ అసలు రూపం బయటపెట్టిన కమెడియన్‌

మొగుడి కోసం లవర్‌ని వదిలేసిన రష్మి పతివ్రతనా?.. జబర్దస్త్ యాంకర్‌ అసలు రూపం బయటపెట్టిన కమెడియన్‌

జబర్దస్త్ లో సుధీర్‌, రష్మి జోడీ ఎంత పాపులర్‌ అయ్యిందో ఆ తర్వాత వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జంట కూడా పాపులర్‌ అయ్యింది. అలాంటిది రష్మిపై ఇమ్మూ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 12 2024, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

జబర్దస్త్ షోలో చాలా వరకు పెయిర్‌ని కలపడం కామన్‌గా మారింది. పెయిర్‌తో షోని రక్తికట్టిస్తూ టీఆర్‌పీ రేటింగ్‌ పెంచుకుంటుంటారు. సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య, అలాగే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ ల మధ్య, రాకేష్‌, సుజాతల మధ్య ఇలాంటి పులిహోర కలిపే ప్రోగ్రామ్‌ పెట్టారు. షోని రక్తికట్టించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఇప్పుడు సుధీర్‌, రష్మి దూరమయ్యారు. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌, వర్షల మధ్య కెమిస్ట్రీ పండిస్తూ రక్తికట్టించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంటున్నారు. అయితే జోడీ మార్చడంతో చాలా సార్లు అది వర్కౌట్‌ కావడం లేదు. కానీ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతోఇంతో నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. 
 

311

తాజాగా ఇమ్మాన్యుయెల్‌, వర్షలు కలిసి లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్కిట్‌ చేశారు. అయితే ఈ సారి శ్రీకాంత్, రాశీ కలిసి నటించిన `ప్రేమసి రావే` సినిమాలోని శ్రీకాంత్‌, రాశీల మధ్య లవ్‌ సీన్లని తీసుకున్నారు. ఇందులో రాశీ కోసం శ్రీకాంత్‌ పడే తపన, రూమ్‌కి రమ్మని తన ప్రేమని వ్యక్తం చేసిన తీరుని స్పూఫ్‌ చేశారు ఇమ్మూ, వర్ష. 

411

ఈ సందర్భంగా వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌గా ట్రాక్‌ నడిచింది. ప్రేమపై మీ ఓపీనియన్‌ ఏంటని అడగ్గా, మనల్ని చాలా మంది ప్రేమిస్తారని, మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తామని తెలిపింది వర్ష. ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చు కదా సెట్‌ మొత్తం వెయిటింగ్‌ అని అడగ్గా వర్ష సిగ్గులు పోయింది. 
 

511

ఆ తర్వాత మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెప్పాలని ఇమ్మాన్యుయెల్‌ అడగ్గా, ఆరు అడుగులుండాలని, సిక్స్ ప్యాక్‌ ఉండాలని తెలిపింది వర్ష. మరి మాకు తెలిసిన వాడికి అవన్నీ లేవు కదా అని ఇమ్మూ చెప్పగా, వెంటపడి కొట్టింది వర్ష. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

611

ఇక బాబుతోని పెళ్లి చేసుకుని అతను వీల్‌ చైర్‌ నుంచి లేవలేని స్థితిలో ఉండగా, ఆయనకు వర్ష సపర్యాలు చేస్తుంది. అది చూసిన ఇమ్మాన్యుయెల్‌ కరిగిపోయాడు, కదిలిపోయాడు. వర్షని అలాంటి పరిస్థితిలో చూడలేకపోయాడు. భర్త పరిస్థితి చూసి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఇమ్మూ అడగ్గా,  వర్ష రెచ్చిపోయింది. నీకేం తెలుసురా మా ప్రేమ అంటూ మండిపడింది. 
 

711

ఇక ఇమ్మాన్యూయెల్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడికి వచ్చి చూడవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహించే ప్రతి నీటి బొట్టులోనూ నీ రూపమే కనిపిస్తుందని, మొగుడి కోసం ప్రియుడిని వదిలేసిన ప్రేయసి పతివ్రత అయితే, రష్మి కూడా పతివ్రతనేనే అంటూ రెచ్చిపోయాడు. 
 

811

వర్షతో గొడవ పడేంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులోకి రష్మిపై అంత పెద్ద కామెంట్‌ చేయడం ఇప్పుడు రచ్చ అవుతుంది. యాంకర్‌ రష్మిపై ఇమ్మూ చేసిన షాకింగ్‌ కామెంట్‌ చర్చనీయాంశం అవుతుంది. ఈ గొడవకి, రష్మికి సంబంధమేంటనేది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారుతుంది. 

911

ఇది విన్న యాంకర్‌ రష్మి సైతం నోరెళ్లబెట్టింది. ఇమ్మాన్యూయెల్‌ ఉద్దేశ్యమేంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు. రష్మి కూడా మొగుడి కోసం ప్రియుడిని వదిలేసిందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రష్మి ఆ పని చేసిందా? మున్ముందు చేయబోతుందా? అనేది మరో చర్చకు తావిస్తుంది. 
 

1011

రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ లవర్స్ అనే ప్రచారం ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ ఈ మధ్య ఈ ఇద్దరు దూరమయ్యారు. సుధీర్‌ టీవీ షో మానేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. అయితే ఇమ్మాన్యుయెల్‌ కామెంట్స్ వెనుక అర్థం రష్మి.. సుధీర్‌ని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా? మొగుడి కోసం సుధీర్‌ని వదిలేస్తుందా? అనే చర్చ స్టార్ట్ చేశారు.
 

1111

మొత్తానికి ఫన్‌ కోసం చేసిన ఈ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్‌ రియాక్షన్స్ మాత్రం అదిరిపోయేలా ఉండటం విశేషం. ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఈ శుక్రవారం ఈటీవీలో ఇది ప్రసారం కానున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved