టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా రిజల్ట్ తో బాగా అప్సెట్ అయ్యాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇలాంటి సమయంలో మంచి సక్సెస్ తో ఆడియన్స్ ని పలకరించాలని అనుకుంటున్నాడు. అందుకే తను నటిస్తోన్న సినిమాల విషయంలో కూడా రీఎనాలసిస్ చేసుకుంటున్నాడు.

'హీరో' సినిమాను ఆపేసినప్పటికీ క్రాంతిమాధవ్ తో చేస్తోన్న సినిమాను మాత్రం వాయిదా వేయడం కుదరలేదు. 'పెళ్లిచూపులు' సినిమా తరువాత విజయ్ ఒప్పుకున్న కథ ఇది. కానీ ఆ తరువాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' లాంటి సినిమాలతో హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం అతడికున్న ఇమేజ్ కి తగ్గట్లుగా క్రాంతిమాధవ్ సినిమా ఉంటుందా..? లేదా..? అనే విషయం విజయ్ కి కూడా తెలియడం లేదు.

ఈ క్రమంలో పూరిజగన్నాథ్ తో సినిమా చేసి ఆ తరువాత క్రాంతి మాధవ్ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అందుకు చిత్రనిర్మాత కె.ఎస్.రామారావు అంగీకరించలేదు. ఇప్పుడు గనుక సినిమా ఆపేస్తే విజయ్ కే నమ్మకం లేదని సినిమా కిల్ అయిపోతుందని.. కాబట్టి ఈ సినిమా పూర్తి చేసిన తరువాతే మరో సినిమా చేయాలని ఆయన చెప్పడంతో విజయ్ కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో విజయ్ ఈ సినిమా పూర్తి చేసే వరకు ఆగాలని పూరికి చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి మరో ఆరు నెలల వరకు పూరికి గ్యాప్ రావడం ఖాయం.