Asianet News TeluguAsianet News Telugu

Vijay Deverakonda : చిన్నారికి విజయ్ దేవరకొండ సాయం.. రూ. లక్ష చెక్కు అందజేత.!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మంచి మనస్సు చాటుకున్నారు. యాక్సిడెంట్ లో కాలిని కోల్పోయిన చిన్నారికి ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. తాజాగా చెక్కును అందజేశారు.  
 

Vijay Deverakonda Help to poor girl  NSK
Author
First Published Nov 3, 2023, 2:32 PM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  కెరీర్ లో ఎంతలా దూసుకుపోతున్నారు. తన వ్యక్తిగత జీవితంలోనూ మంచి మార్కులు దక్కించుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా పేదలకు సాయం చేస్తూ నలుగురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ‘ఖుషి’ చిత్రంతో విజయ్ మంచి రిజల్ట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయిన ఆనందంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

తన రెమ్యూనరేషన్ లోంచి పేదలకు అందజేస్తానని ప్రకటించారు. కోటీ రూపాయలను 100 మంది నిరుపేదలకు, అత్యవసరమైన వారికి ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి చెక్కును పంపించారు. వివరాల్లోకి వెళ్తే..  శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండటం కురుడు గ్రామానికి చెందిన అప్పలనాయుడు క్రిష్ణవేణి దంపతుల కూతురు షర్మిలశ్రీకి సాయం అందింది. ఆగస్టులో చిన్నారిని ఆటో ఢీకొనడంతో కాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమె చిన్నారి కుడిగాలిని తొలగించాల్సి వచ్చింది. అయితే వారికి వైద్య ఖర్చులు స్థోమతకు మించి అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ చిన్నారికి ఆర్థిక సాయం చేశారు. 

తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులు చిన్నారి కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్ద కలిశారు. రూ. లక్ష విలువగల చెక్కును బాలికకు అందజేశారు. విజయ్ అభిమాని అల్లు తారక్ సమక్షంలో ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా చిన్నారి, కుటుంబ సభ్యులు విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విజయ్ కరోనా సమయంలో పేదలకు తనవంతుగా సహాయం చేసిన విషయం తెలిసిందే. 

ఇక విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఇచ్చిన సక్సెస్ తో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’, ‘VD12’పై ఫోకస్ పెట్టారు. అలాగే మరిన్ని చిత్రాలనూ లైనప్ లో పెట్టారని తెలుస్తోంది. వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్  త్వరలో రానున్నాయని సమాచారం. రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇందులోని డైలాగ్ ఎంతలా ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios