విజయ్, గౌతమ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతొ దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఏం జరుగుతుందో టీమ్ తెలిపింది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ మూవీని ప్రకటించారు. `వీడీ12` పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఇప్పటి వరకు ఇది ప్రారంభం కాలేదు. అధికారికంగా ప్రకటించి కూడా ఏడాది కావస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికితోడు దర్శకుడు గౌతమ్.. మరో చిన్న సినిమా చేస్తున్నారు. దీంతో ఈ మూవీ క్యాన్సిలే అని అంటున్నారు.
విజయ్, గౌతమ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో బడ్జెట్ సమస్యతో దీన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారటే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో దీనిపై తాజాగా టీమ్ స్పందించింది. పీఆర్ టీమ్ రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్ లో నిజం లేదని తెలిపారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.
విజయ్‌తో సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దర్శకుడు గౌతమ్ మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓ చిన్న సినిమా చేశారట. త్వరలోనే దాన్ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ గ్యాంగ్ స్టర ప్రధానంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే `వీడీ12` స్టార్ట్ అవుతుందట. మార్చిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక విజయ్ దేవరకొండ.. `గీతగోవిందం` తర్వాత పరశురామ్ దర్శకత్వంలో `ఫ్యామిలీ స్టార్` సినిమాలో నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. అంచనాలను పెంచేసింది. ఇందులో విజయ్ ఓ వైపు ఇంట్లో పనులు చూసుకుంటూ, మరోవైపు ఎవడైనా తనపై కామెంట్ చేస్తే తనలోని మాస్ యాంగిల్‌ని చూపించే పాత్రలో కనిపిస్తున్నారు. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
